రోజురోజుకీ హాట్ డోస్ పెంచుతోన్న రాశీ ఖన్నా.. హీటెక్కిస్తోన్న నయా లుక్స్!
టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న పాత్రతో కనిపించి కనువిందు చేసి ఆ తర్వాత పాపులర్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. తన అందచందాలతోనే కాకుండా నటనపరంగా పర్వాలేదనిపించుకుంది. అయితే మొదట్లో ఎంతో పద్ధతిగా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటి తర్వాత డోస్ పెంచుతూ గ్లామర్ అండ్ హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హాట్ నెస్ ను రోజురోజుకీ పెంచుతోంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలి అట్రాక్ట్ చేస్తోంది.

నటనపై ఆసక్తితో..
తెలుగులో పాపులర్ హీరోయిన్లలో ఒకరైన మోస్ట్ బ్యూటిఫుల్ రాశీ ఖన్నా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమె చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. అందుకే కెరీర్ మొదట్లో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సత్తా చాటింది. ఇక మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత రాశీ ఖన్నాకు నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఆమె తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది.

మెయిన్ హీరోయిన్ గా..
గ్లామరస్ భామ రాశీ ఖన్నా హిందీలో మొదట మద్రాస్ కేఫ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆఫర్స్ వచ్చాయి. దీంతో పలు భాషల్లో ఆమెకు ఆఫర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రాశి ఖన్నాకు తెలుగులో అవకాశం వచ్చింది. ముందుగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం రాశీ ఖన్నా ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రధాన కథానాయికగా కెరీర్ ప్రారంభించింది.

తమిళ్, మలయాళంలో..
నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ డైరెక్టెడ్ మూవీ ఊహలు గుసగుసలాడేలో పద్ధతిగా క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న రాశీ ఖన్నా.. నటనపరంగానూ ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో మొదటి చిత్రంతోనే తెలుగులో చాలా ఫేమస్ అయింది. అదే సమయంలో కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. ఆ తర్వాత రాశీ ఖన్నా వరుసగా అవకాశాలు దక్కించుకుని హవాను చాటింది. ఈ క్రమంలోనే 'విలన్' అనే చిత్రంతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే సినిమాతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

అనేక చిత్రాలు..
కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ అక్కడ కూడా బిజీగా మారింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా. అనంతరం హిందీ చిత్ర పరిశ్రమలోనూ పలు సినిమాలు చేసి బాగా రాణించింది. గత ఏడాది తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో పాటు తమిళంలో తిరు అనే సినిమా చేసింది రాశీ ఖన్నా. కానీ ఈ చిత్రాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. రాశీ ఖన్నా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే చిత్రాలు చేసింది.
ఏదో ఒక పోస్ట్ తో..
హిందీ, కోలీవుడ్, మాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది బొద్దు గుమ్మ రాశీ ఖన్నా. ఏకధాటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ అంతే సందడి చేస్తోంది. నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో పాటు పర్సనల్, కెరీర్ విషయాలు అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ అట్రాక్ట్ చేస్తోంది ఈ బబ్లీ గర్ల్.
మోడ్రన్ డ్రెస్సులో హాట్ పోజులు..
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా రోజురోజుకీ గ్లామర్ డోస్ పెంచుతోంది. తాజాగా మరి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. లైట్ కలర్ మోడ్రన్ డ్రెస్సు ధరించిన రాశీ ఖన్నా.. డిఫరెంట్ యాంగిల్స్ లో పోజులిస్తూ ఎద అందాలను ప్రదర్శించింది. స్లీవ్ లెస్ డిజైనర్ డ్రెస్సులో వయ్యారంగా నిల్చుని ఫొటోలకు పోజులిచ్చింది. అయితే ఇందులో అందాల ప్రదర్శన కంటే రాశీ ఖన్నా హాట్ పోజులు, మత్తెక్కించే చూపులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











