Rashi Khanna: చీరలోనూ రాశీ ఖన్నా హాట్ షో.. అలాంటి పోజులతో అందాలు చూపిస్తూ!
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటూ సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోంది బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఈ ముద్దుగుమ్మ మొదటి నుంచి తనదైన యాక్టింగ్ స్కిల్ తో అతి తక్కువ సమయంలోనే పాపులర్ హీరోయిన్ గా మారింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా రెగ్యులర్ గా మూవీస్ చేస్తూ సత్తా చాటుతోంది. ఇటీవల కాలంలో దక్షిణాదితో పాటు ఉత్తరాది చిత్రాల్లోనూ నటిస్తూ హవాను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే రచ్చ చేస్తోంది. హాట్ హాట్ ఫొటోలు పెడుతూ మరింతగా హైలెట్ అవుతోంది.

సినిమాపై మక్కువతో..
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమె చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. అందుకే కెరీర్ మొదట్లో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సత్తా చాటింది. ఇక మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత రాశీ ఖన్నాకు నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఆమె తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది.

చిన్న పాత్ర తర్వాతే..
ముద్దుగుమ్మ రాశీ ఖన్నా హిందీలో మొదట మద్రాస్ కేఫ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆఫర్స్ వచ్చాయి. దీంతో పలు భాషల్లో ఆమెకు ఆఫర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రాశి ఖన్నాకు తెలుగులో అవకాశం వచ్చింది. ముందుగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం రాశీ ఖన్నా ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.

మలయాళం చిత్రంలో కూడా..
అవసరాల శ్రీనివాస్ డైరెక్టెడ్ మూవీ ఊహలు గుసగుసలాడేలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.. యాక్టింగ్ పరంగానూ ఫిదా చేసేసింది. దీంతో మొదటి చిత్రంతోనే తెలుగులో యమ ఫేమస్ అయింది. అదే సమయంలో కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. తెలుగులో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న రాశీ ఖన్నా వరుసగా అవకాశాలు దక్కించుకుని హవాను చాటింది. ఈ క్రమంలోనే 'విలన్' అనే చిత్రంతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే సినిమాతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

దెబ్బ మీద దెబ్బ..
కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ అక్కడ కూడా బిజీగా మారింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా. అనంతరం హిందీ చిత్ర పరిశ్రమలోనూ పలు సినిమాలు చేసి సత్తా చాటింది. గత ఏడాది తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో పాటు తమిళంలో తిరు అనే సినిమా చేసింది రాశీ ఖన్నా. కానీ ఈ చిత్రాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. రాశీ ఖన్నా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే చిత్రాలు చేసింది.

కిస్ సీన్లలో నటించి..
బాలీవుడ్ లో సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తో రుద్ర అనె వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు రాశీ ఖన్నా యోధ అనే సినిమాతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. రాశీ ఖన్నాతో పాటు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో షాహిద్ తో ఘాటు చుంబన సీన్లలో నటించి ఔరా అనిపించింది.

పర్సనల్, కెరీర్ విషయాలతో..
ఇలా హిందీ, కోలీవుడ్, మాలీవుడ్ తో పాటు తెలుగులోనూ నటిస్తూ అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఏకధాటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ అంతే సందడి చేస్తోంది. నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో పాటు పర్సనల్, కెరీర్ విషయాలు అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ అట్రాక్ట్ చేస్తోంది ఈ బబ్లీ గర్ల్.
డిఫరెంట్ పోజులతో హాట్ ట్రీట్..
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా తాజాగా మరి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. రెడ్ కలర్ చీర కట్టుకున్న రాశీ ఖన్నా హాట్ గా దర్శనమిచ్చింది. ఈ పొటోల్లో వయ్యారంగా పోజులిచ్చిన బొద్దుగుమ్మ రాశీ ఖన్నా తన ఎద అందాలను ఆరబోసింది. కొంచెం బెండ్ అవుతూ, సైడ్ నుంచి చూస్తూ డిఫరెంట్ పోజులతో హాట్ ట్రీట్ అందించి. ఫలితంగా ఆమె అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











