హాట్ బ్యూటీ రాశి ఖన్నా.. మల్టీ టాలెంటెడ్ వీడియో వైరల్!
సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ సెలబ్రెటీస్ చాలా మంది ఉంటారు. అయితే ఆల్ రెడీ ఒక రంగంలో సక్సెస్ అయిన వారు మళ్ళీ మరొక రంగంలో సక్సెస్ అవ్వడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ఇక ప్రస్తుత రోజుల్లో హీరోలు సింగింగ్ తో మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే. కానీ హీరోయిన్స్ మాత్రం చాలా వరకు నటనపైనే దృష్టి పెడుతుంటారు.
అయితే ఒక స్టార్ బ్యూటీ మాత్రం తక్కువ రోజుల్లోనే మల్టీ టాలెంటెడ్ గర్ల్ గా నిరూపించుకుంది. పాటలు పడటమే కాకుండా గిటార్ వాయిస్తూ రెండు పనుల్లో అనుభవం కలిగిన మ్యూజిక్ డైరెక్టర్ గా దర్శనమిచ్చింది. గతంలోనే ఈ బ్యూటీ సింగర్ గా కొన్ని పాటలు కూడా పాడింది. ఇక ఈ లాక్ డౌన్ లో రాశి ఖన్నా ఎక్కువగా సింగింగ్ పైనే దృష్టి పెట్టిందట. అలాగే గిటార్ కూడా పాటకు తగ్గట్లు వాయించడం కూడా నేర్చుకుందట.

మొన్న సోషల్ మీడియాలో అమ్మడు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విషయంలో ఆమె చేసిన కామేంట్స్ పై అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అలాగే నెటీజన్స్ నుంచి ట్రోల్స్ రావడంతో తప్పుగా అర్థం చేసుకోవద్దని ఒక వివరణ కూడా ఇచ్చింది. ఇక లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఉంటున్న లావణ్య త్వరలో షూటింగ్ వర్క్ లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











