హాట్ షోలో మళ్లీ డోస్ పెంచిన రాశీ ఖన్నా.. హద్దు దాటి అలా ఎద చూపిస్తూ అరాచకం!

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగాక స్టార్ హీరోయిన్లు సైతం అందులో హాట్ ఫొటోలతో హీట్ పెంచేస్తున్నారు. సినిమాల ప్రమోషన్స్ తోపాటు తమ పర్సనల్ హాట్ ఫొటోషూట్ లను పంచుకుంటూ అట్రాక్ట్ చేస్తున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు. అలాంటి వారిలో ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన‌తో పాటు క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసే రాశీ ఖన్నా.

సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోంది బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో రోజురోజుకీ హాట్ డోస్ పెంచుతూ కవ్విస్తోంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసి రచ్చ చేస్తోంది.

కెరీర్ ప్రారంభంలో..

కెరీర్ ప్రారంభంలో..

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ గా పేరొందిన రాశీ ఖన్నా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమె చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. అందుకే రాశీ ఖన్నా కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సత్తా చాటింది.

ఇక మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత రాశీ ఖన్నాకు నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఆమె తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది.

మొదటగా అక్కడ ఎంట్రీ..

మొదటగా అక్కడ ఎంట్రీ..

స్టన్నింగ్ బ్యూటీ రాశీ ఖన్నా మొదటగా హిందీ చిత్ర పరిశ్రమలో కాలు మోపింది. అక్కడ మద్రాస్ కేఫ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. బాలీవుడ్ హంక్ జాన్ అబ్రహం హీరోగా చేసిన ఈ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆఫర్స్ వచ్చాయి. దీంతో పలు భాషల్లో ఆమెకు ఆఫర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రాశి ఖన్నాకు తెలుగులో అవకాశం వచ్చింది.

క్యూట్ లుక్స్.. యాక్టింగ్ కేక..

క్యూట్ లుక్స్.. యాక్టింగ్ కేక..

బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా ముందుగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇందులో నాగ చైతన్యకు గర్ల్ ఫ్రెండ్ ఒకే ఒక్క సీన్ లో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది ఈ క్యూట్ బ్యూటీ. అలాగే యాక్టింగ్ తోనూ అలరించింది.

వివిధ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

వివిధ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో లీడ్ హీరోయిన్ గా చేసిన మొదటి మూవీతోనే యమ ఫేమస్ అయింది స్టన్నింగ్ బ్యూటి రాశీ ఖన్నా. అదే సమయంలో కుర్రాళ్లకు క్రష్‌‌గా మారింది. తెలుగులో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న రాశీ ఖన్నా వరుసగా అవకాశాలు దక్కించుకుని హవా చాటింది. ఈ క్రమంలోనే 'విలన్' అనే చిత్రంతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే సినిమాతో కోలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి అక్కడ ఆకట్టుకుంది.

కార్తీతో నటించిన సినిమా మాత్రం..

కార్తీతో నటించిన సినిమా మాత్రం..

కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాలు చేస్తూ అక్కడ కూడా బిజీగా మారింది బబ్లీ గర్ల్ రాశీ ఖన్నా. అనంతరం హిందీ చిత్ర పరిశ్రమలోనూ పలు సినిమాలు చేసి సత్తా చాటింది.

గత ఏడాది తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో పాటు తమిళంలో తిరు, సర్దార్ అనే సినిమాలు చేసింది రాశీ ఖన్నా. కానీ ఇందులో కార్తీతో నటించిన సర్దార్ మూవీ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. మిగతా చిత్రాలన్నీ ప్లాప్ కావడంతో రాశీకి నిరాశే మిగిలింది.

ఆర్బీఐ ఆఫీసర్ గా..

ఆర్బీఐ ఆఫీసర్ గా..

రాశీ ఖన్నా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'తిరుచిత్రబలమ్' సినిమాలతోపాటు మలయాళంలో 'బ్రహ్మమ్' మూవీ చేసింది. ఇక బాలీవుడ్ లో సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తో రుద్ర అనె వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకుంది. ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకుంది. ఇందులో షాహిద్ కపూర్ కు గర్ల్ ఫ్రెండ్ గా, ఆర్బీఐ ఆఫీసర్ గా అలరించింది.

యోధ సినిమాతో..

ప్రస్తుతం ముద్దుగుమ్మ రాశీ ఖన్నా హిందీలో యోధ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా తర్వలో విడుదల కానుంది. ఇలా హిందీ, కోలీవుడ్, మాలీవుడ్ తో పాటు తెలుగులోనూ నటిస్తూ అలరిస్తోంది ఈ రాశీ ఖన్నా. ఏకధాటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ అంతే సందడి చేస్తోంది. నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో పాటు పర్సనల్, కెరీర్ విషయాలు అభిమానులతో పంచుకుంటోంది.

రోజురోజుకీ హాట్ డోస్..

సోషల్ మీడియాలో ఎప్పటి నుంచే సందడి చేస్తోన్న బ్యూటిఫుల్ రాశీ ఖన్నా తాజాగా మరి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఇందులో బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన రాశీ ఖన్నా యమ హాట్ గా దర్శనం ఇచ్చింది. డిఫరెంట్ యాంగిల్స్ లో పోజులిస్తూ కేవలం తన ఎద అందాలు మాత్రమే చూపిస్తూ అట్రాక్ట్ చేసింది.

వివిధ భంగిమల్లో కొంటెగా చూస్తూ తన ఎదపై ఫోకస్ పడేలా ఫొటోలకు పోజులిచ్చింది. ఇలా రోజురోజుకీ క్లీవేజ్ షో చేస్తూ హాట్ డోస్ తో హీట్ పెంచేస్తోంది బబ్లీ గర్ల్ రాశీ ఖన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X