Rashi Khanna గ్యాస్ ట్యాంకర్ అంటూ కామెంట్.. బాడీ షేమింగ్‌పై రాశీ ఖన్నా ఆవేదన

హీరోయిన్ రాశి ఖన్నా ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకు పోయింది కానీ ఈ మధ్యనే కాస్త ఆచితూచి సినిమాలు ఎంచుకోవడం మొదలు పెట్టింది. అదీకాక ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ తరువాత తరువాత జీరో సైజ్ కు వచ్చి మరీ చర్చనీయాంశంగా మారింది. అయితే తనని కెరీర్ మొదట్లో బాడీ షేమింగ్ చేశారని అంటూ దక్షిణాది వారి మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

బంపర్ ఆఫర్

బంపర్ ఆఫర్

ఢిల్లీలో జన్మించిన రాశి ఖన్నా ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నా అనుకోకుండా విధి ఆమెను నటిని చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె సినిమాల్లో నటించడానికి ముందు యాడ్ ఫిలిమ్స్ కి ఒక కాపీ రైటర్ గా పని చేసేది.ఆమె కాపీ రైటర్ గానే సెటిల్ అవ్వాలని అనుకుంది. కానీ యాడ్ ఫిలిమ్స్ కి ఒక కాపీ రైటర్ గా పనిచేస్తున్న సమయంలో ఆమెకు బాలీవుడ్ లో జాన్ అబ్రహం భార్య పాత్రలో నటించే బంపర్ ఆఫర్ తగిలింది.

నటిగా మారి

నటిగా మారి

కానీ ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఆమెకు ఆ ఆఫర్ రావడంతో మరో ఆలోచన ఏదీ చేయడకుండా మద్రాస్ కేఫ్ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత తెలుగులో అక్కినేని వారి ఫ్యామిలీ కధా చిత్రం మనం సినిమాలో నాగచైతన్య లవర్ పాత్ర చిన్నదే అయినా నటించి తెలుగు వారికి నోటెడ్ అయింది.

ఇక ఆ తరువాత ఆమె రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, శివమ్ , బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్ , జై లవ కుశ, రాజా ది గ్రేట్ , సినిమాలు చేసి తెలుగులో సత్తా చాటింది. అయితే ఆ తరువాత విలన్ సినిమాతో మలయాళ సినీ ఎంట్రీ కూడా ఇచ్చింది. తర్వాత తెలుగులో మరికొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత ఆమెకు తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా

బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా

అయితే కొత్త హీరోయిన్స్ ఎంట్రీతో రాశిఖ‌న్నా కొంత వెనుకపడింది. అయితే కెరీర్ మొదట్లో తాను బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని.. బొద్దుగా ఉండడం వలన దక్షిణాది చిత్ర పరిశ్రమ వాళ్లు తన పై కామెంట్స్ చేసేవారని ఆమె కామెంట్స్ చేసింది. ఇప్పటివరకు కెరీర్ పరంగా మీరు ఎదుర్కొన్న విమర్శలు ఏమిటి? అని ప్రశ్నించగా.. రాశీ ఖన్నా ఈ విషయాలను బయట పెట్టింది.

 గ్యాస్ ట్యాంకర్

గ్యాస్ ట్యాంకర్

దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్‏గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో చాలా మంచి అవకాశాలు వచ్చాయని దానికి చాలా సంతోషించానని అన్నారు. కానీ శరీరాకృతి పరంగా నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని ఆమె పేర్కొన్నారు. చూడటానికి లావుగా ఉన్నానని దక్షిణాదిలో చాలా మంది నన్ను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవాళ్ళు అని పేర్కొంది.

సన్న బడ్డా

సన్న బడ్డా

కొంతకాలం గడిచే సరికి సన్నగా మారాలని నిర్ణయించుకుని ఫిట్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. నా వృత్తి కోసం నాజుగ్గా ఉండడం ఎంతో అవసరమని అర్థమైందని, ఇక నన్ను అన్న వాళ్ల నోర్లు మూయించాలని కాదు కానీ నాజుగ్గా ఉండడం ఎంతో అవసరమని సన్న బడ్డాను అని ఆమె పేర్కొంది... సోషల్ మీడియాలోనూ ఇలాంటి విమర్శలు ఎదురైనప్పటికీ తాను ఏ మాత్రం బాధపడలేదు" అంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X