Rashi Khanna: అతడితో డేటింగ్ వల్లే బరువు తగ్గాను.. సీక్రెట్ లవర్ గురించి రాశీ ఖన్నా

రాశీ ఖన్నా అంటే గుర్తు పట్టని తెలుగు ప్రేక్షకులు ఉండరు. క్యూట్ లుక్స్ తో ఎంతోమందికి క్రష్ గా మారిపోయింది ఈ బొద్దుగుమ్మ. మనం సినిమాలో నాగ చైతన్యకు లవర్ గా ఒక చిన్న కెమియో చేసిన ఈ సొగసరి తర్వాతి కాలంలో ఊహించని పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో అనేక చిత్రాల్లో తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసిన ఈ చిన్నదానికి యువతలో మంచి ఫాలోయింగే ఉంది. అయితే రాశీ ఖన్నా ప్రేమలో పడిందా? అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా తన సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ గురించి రాశీ ఖన్నే స్వయంగా చెప్పడం విశేషం.

అతడితో జోడి:తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ గ్లామరస్ అండ్ అట్రాక్టివ్ హీరోయిన్ గా పేరొందిన రాశీ ఖన్నా ఢిల్లీలో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకున్న ఈ బ్యూటి మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహంతో జత కట్టిన మద్రాస్ కేఫ్ మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

Rashi Khanna Reveals About Her Dating Secret Boyfriend

సౌత్ సినిమాలు:మద్రాస్ కేఫ్ తర్వాత మనం సినిమాలో ఒక చిన్న పాత్రతో సందడి చేసిన బొద్దుగుమ్మ రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఈ సినిమాలో తన క్యూట్ నటన అండ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను కట్టిపడేసింది. ఆ తర్వాత 'విలన్' మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్'తో తమిళంలోకి సైతం ఎంట్రీ ఇచ్చేసింది.

ప్లాప్స్ అండ్ హిట్స్:అప్పటి నుంచి దక్షిణాది భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ సత్తా చాటుతోంది సొట్టబుగ్గల బ్యూటి రాశీ ఖన్నా. అలా తెలుగులో బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, తొలి ప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో నటించింది. గతేడాది వచ్చిన పక్కా కమర్షియల్, తిరు, థ్యాంక్యూ చిత్రాలు వరుసగా ప్లాప్ కాగా.. సర్దార్ మూవీ మాత్రం ఆకట్టుకుంది.

Rashi Khanna Reveals About Her Dating Secret Boyfriend

సిరీసులతో:హిందీలో రుద్ర వెబ్ సిరీస్ చేసిన గ్లామర్ బొమ్మ రాశీ ఖన్నా ఇటీవల ఫర్జీతో అలరించింది. ఇందులో షాహిద్ కపూర్ తో బోల్డ్ సీన్లలో నటించి రొమాన్స్ పండించింది. ప్రస్తుతం ఈ సొగసరి హిందీలో యోధ, తమిళంలో రెండు చిత్రాలు చేస్తోంది. ఇదిలా ఉంటే రాశీ ఖన్నా ప్రారంభంలో బొద్దుగా ఉండేది. కానీ తర్వాత స్లిమ్ గా మారి సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. అందుకు కారణం ఓ వ్యక్తి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ భామ.

Rashi Khanna Reveals About Her Dating Secret Boyfriend

డిప్రెషన్లోకి వెళ్లా:"గతంలో నేను ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను. కానీ, అతడితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్ కు గురయ్యాను. మళ్లీ దానికి తోడు నాకు థైరాయిడ్ సమస్య ఉండటం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోయాను. చాలా ప్రయత్నించా. ఎన్నో వర్కౌట్స్ చేశా. కానీ, బరువు తగ్గలేదు. జిమ్ లో కోచ్ ని మార్చిన కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. అలా నా బరువు ప్రభావం నేను చేసే సినిమాలపై పడింది" అని రాశీ ఖన్నా తెలిపింది.

Rashi Khanna Reveals About Her Dating Secret Boyfriend

డేటింగ్ స్టార్ట్:"హీరోయిన్ బరువు పెరిగితే అవకాశాలు ఎలా వస్తాయి. మీరే చెప్పండి. అయితే చివరిగా నన్ను అర్థం చేసుకునే ఓ వ్యక్తి దొరికాడు. అతడితో డేటింగ్ మొదలు పెట్టిన తర్వాత అదేంటో గానీ బరువు తగ్గడం స్టార్ట్ అయింది. బరువు తగ్గి స్లిమ్ అయ్యాను. చెప్పాలంటే నేను అనుకున్నట్లుగా మారాను" అని రాశీ చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది రాశీ ఖన్నా చెప్పలేదు. దీంతో అతను ఎవరా అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X