సముద్రపు ఒడ్డున రాశీ ఖన్నా.. బాగా బక్కచిక్కి భలే ఫోజిచ్చింది
సినీ లోకంలో ముద్దుగుమ్మల అందాలే ప్రేక్షకులకు విలాసవంతమైన విందు లాంటివి. అందుకే అందాలు ఆరబోయడం, డిఫెరెంట్ స్టైల్ ఫోటో షూట్స్‌లో పాల్గొనడం లాంటివి హాబీగా మార్చుకున్నారు నేటితరం హీరోయిన్లు. ఈ నేపథ్యంలోనే అందాల భామ రాశిఖన్నా సముద్రపు ఒడ్డున తళుక్కుమని మెరిసింది. డిఫెరెంట్ యాంగిల్స్ లో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
'సముద్రపు గాలి ఎంతో హ్యాపీ' అంటూ ఈ పిక్స్ షేర్ చేసిన అమ్మడు 'వెంకీ మామ' షూటింగ్ లో భాగంగా ఈ ఫోటో షూట్‌లో పాల్గొన్నానని తెలిపింది. మరీ ఎక్కువగా అందాలు ఆరబోయకుండా కేవలం లుక్స్ తోనే అట్రాక్ట్ చేసింది రాశి ఖన్నా. అయితే ఈ ఫొటోల్లో ఆమె బాగా బాగా బక్కచిక్కి సెక్సీగా కనిపిస్తుండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ''సెక్సీ లుక్స్, టూ హాట్, సూపర్, బక్కచిక్కి భలే ఫోజులిస్తున్నావ్‌గా, రాశి ఖన్నా యూ ఆర్ వెరీ వెరీ స్పెషల్'' అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. సినిమాలతో బిజీగా ఉంటూనే ఇలా సోషల్ మీడియాలో టచ్ లో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశీ ఖన్నా.. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన 'జిల్' మూవీతో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇక ఆ వెంటనే వరుస సినిమాలు చేస్తూ ఎన్టీఆర్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లాంటి ఫేమస్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'వెంకీ మామ' సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండతో మరో సినిమాలో రొమాన్స్ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా రాశీ ఖన్నా జోరు కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











