ఇటు మెగా మేనల్లుడు అటు విజయ్ దేవరకొండ.. రొటేట్ చేస్తూ రొమాన్స్ చేస్తున్న రాశి ఖన్నా!

యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. డేట్స్ సర్దుబాటు చేసుకుంటూ ఏ ఒక్క నిమిషమూ వృధా చేయడం లేదు. అంచేతనే ఇటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ని, అటు విజయ్ దేవరకొండను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాశి ఖన్నాకు. అర్థం కాలేదా? అదేనండీ ఈ ఇద్దరితో రొటేట్ చేస్తూ సెట్స్‌పై రొమాన్స్ చేస్తుందట రాశి ఖన్నా. ఇంకా అర్థం కాలేదంటే.. పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది.

యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు 'ప్రతీ రోజు పండగే' పరిస్థితి కూడా అదే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన నటిస్తోంది రాశి ఖన్నా. ఈ రెండు సినిమాల సెట్స్‌పై బిజీ అయిన కారణంగా ఓ రోజు విజయ్ దేవరకొండతో, ఇంకోరోజు సాయిధరమ్ తేజ్‌తో ఆడిపాడుతోందట రాశి ఖన్నా. అదన్నమాట సంగతి.

Rashi Khannas Rotating Romance Highlighted in Social media

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్ లకు తమ తమ కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమాలు వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతీ రోజు పండగే. వారి వారి కెరీర్ లో ఈ సినిమా హిట్ కావాల్సిన అవసరం ఉండటంతో ఈ ఇద్దరు హీరోలు కూడా తమ సినిమాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టారట. ఈ తరుణంలో రాశి ఖన్నా అక్కడా, ఇక్కడా మెయిన్‌టైన్ చేయాల్సిన అవసరం రావడం ఆసక్తి కలిగించే అంశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X