For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rashi Khanna : తొలిసారిగా ఘాటు అందాల విందు.. బ్యాక్ లెస్ టాప్ తో సైడ్ యాంగిల్లో అరాచకం!

  |

  కాస్త సినిమాలు తగ్గడంతో హీరోయిన్ రాశి ఖన్నా గ్లామర్ షో మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా షేర్ చేసిన ఫోటో అయితే రచ్చ రేపుతోంది. బ్యాక్ లెస్ టాప్ లో అధరాల అందాలు కనిపించే విధంగా ఆమె ఫోటో షేర్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  ఐ ఏ ఎస్ కాబోయి

  ఐ ఏ ఎస్ కాబోయి

  ఢిల్లీలో జన్మించిన రాశి ఖన్నా అక్కడే ఆమె సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేసి, బి.ఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. రాశి ఖన్నా చిన్నప్పుడు బాగా చదివేదట, అంతే కాక ఆ రోజుల్లో ఆమె టాపర్ గా కూడా ఉండేదట. చిన్నప్పుడు ఆమెకు సింగర్ కావాలనే కోరిక బలంగా ఉండేదట. అయితే ఆమెకు కొంత వయసు వచ్చాక చదువు మీద ఆసక్తి కలిగి ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ కావాలని కలలు కనేది. అంతేకాక ఆమె తనకు అటు మోడలింగ్ మీద కానీ, నటన మీద కానీ ఆసక్తి లేదని, అనుకోకుండా విధి తనను నటిని చేసిందని ఆమె చెబుతూ ఉంటుంది. ఆమె సినిమాల్లో నటించడానికి ముందు ప్రకటనల కోసం కాపీ రైటర్ గా పని చేసేది.

  మద్రాస్ కేఫ్ తో

  మద్రాస్ కేఫ్ తో

  ఇక అక్కడ పనిచేస్తున్న సమయంలో ఆమెకు బాలీవుడ్ లో జాన్ అబ్రహం భార్య పాత్రలో నటించే బంపర్ ఆఫర్ తగిలింది, మన దాకా వచ్చిన ఆఫర్ ను ఎవరు కాదనుకుంటారు చెప్పండి, అలా ఆమె మద్రాస్ కేఫ్ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత తెలుగులో అక్కినేని వారి ఫ్యామిలీ కధా చిత్రం మనం సినిమాలో నాగచైతన్య లవర్ పాత్రలో నటించి, చిన్న పాత్రే అయినా మెప్పించింది. ఇక ఆ తరువాత ఆమె మళ్ళీ వెనక్కి చూసుకునే పని పడలేదు, ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, శివమ్ , బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్ , జై లవ కుశ, రాజా ది గ్రేట్ , సినిమాలతో తెలుగులో సత్తా చాటగా, విలన్ సినిమాతో మలయాళ ఎంట్రీ కూడా ఇచ్చింది. తర్వాత తెలుగులో మరికొన్ని సినిమాలు చేయగా తమిళ డెబ్యూ ఆఫర్ కూడా లభించింది.

  తమిళం మీద ఫోకస్

  తమిళం మీద ఫోకస్

  అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ రాశిఖ‌న్నా ఈ మ‌ధ్య అందాల ఆర‌బోత‌లో డోస్‌ను పెంచుతోంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం భాష‌ల్లో ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది రాశి ఖ‌న్నా. అయినా సరే ఎక్కడా వెనక్క తగ్గకుండా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ తో పాటు హాట్ ఫోటోలు కూడా తన అభిమానులతో పంచుకుంటూ రచ్చ రేపుతోంది. మన దగ్గర ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్, జై లవకుశ, ప్రతి రోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాలతో బిజీ హీరోయిన్‌గా మారిన రాశీ ఖన్నా తమిళ తంబీలను ఆకట్టుకునే పనిలో భాగంగా తమిళంలో అయితే వరుస సినిమాలు ఒప్పుకుంది. ఇప్పుడు తాజాగా ఆమె తానా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫోటో అయితే సంచలనంగా మారింది.

  ఆమ్మో అందాల విందు

  ఆమ్మో అందాల విందు

  నిజానికి కెరియర్ స్టార్టింగ్‌లో బొద్దుగా ఉండే రాశీ ఖన్నా.. ఈ మధ్య నాజూకుగా మారి, తన లేలేత అందాలను బహిర్గతం చేస్తూ హాట్ హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే అదిరిపోయే హాట్ ఫొటో షూట్‌లు నిర్వహిస్తూ.. తనలోని గ్లామర్ యాంగిల్‌కి పదును పెడుతతున్న రాశి ఖన్నా తాజాగా ఒక బ్యాక్ లెస్ ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ పిక్ లో ఒక పక్క సైడ్ యాంగిల్‌లో తన అందాలు చూపిస్తూ ఓర కంట చూస్తున్న ఒక ఫోటో అయితే ఇప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టేసుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  Tollywood Stars Unbelievable Support To Vihayy Devarakonda | Filmibeat Telugu
  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  ఇక రాశి ఖన్నా సినిమాల విషయానికి వస్తే చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆమె చేతిలో ఇప్పుడు ఏకంగా తొమ్మిది సినిమాలు ఉన్నాయి, తుగ్లక్ దర్బార్, అరణ్మనై , భ్రమమ్, పక్కా కమర్షియల్, థాంక్యూ , సర్దార్, తిరుచిత్రం బలం, మేథవి, సైతాన్ కా బచ్చా సినిమాల్లో ఆమె నటిస్తుండగా ఈ సినిమాలు ఇప్పుడు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి.

  English summary
  Raashi Khanna is an actress who predominantly works in Telugu and Tamil language film industries. she treats her followers with hot pics often in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X