Rashi Khanna గ్లామర్ ట్రీట్..అలా అందాలు ఆరబోస్తూ కనువిందు!
హీరోయిన్ రాశి ఖన్నా ఇదివరకు వరుస సినిమాలతో దూసుకు పోయేది. కానీ అనూహ్యంగా సినిమాలు తగ్గడంతో ఆమె గ్లామర్ షో మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా షేర్ చేసిన ఫోటో ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. బటన్స్ లేకుండా షర్ట్ కిందకు లాగేసి మరీ దిగిన ఒక ఫోటో షేర్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

అనుకోకుండా
ఢిల్లీలో జన్మించిన రాశి ఖన్నా అక్కడ ఆమె సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేసింది. ఇక కాలేజ్ చదువు కూడా అక్కడే పూర్తి చేసింది. రాశి ఖన్నా చిన్నప్పటి నుంచి చదువు విషయంలో ముందు ఉండేదట. అబీడీజే చదువుకునే రోజుల్లో ఆమె టాపర్ గా కూడా ఉండేది. చిన్నప్పుడు ఆమెకు సింగర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. కానీ ఆమెకు కాస్త ఆలోచించే వయసు వచ్చాక చదువు మీద ఆసక్తి కలిగి ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నది. అంతేకాక ఆమె తనకు అటు మోడలింగ్ మీద కానీ, నటన మీద కానీ ఆసక్తి లేదని, అనుకోకుండా విధి తనను నటిని చేసిందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె సినిమాల్లో నటించడానికి ముందు యాడ్ ఫిలిమ్స్ కి ఒక కాపీ రైటర్ గా పని చేసేది.

మద్రాస్ కేఫ్ తో
యాడ్ ఫిలిమ్స్ కి ఒక కాపీ రైటర్ గా పనిచేస్తున్న సమయంలో ఆమెకు బాలీవుడ్ లో జాన్ అబ్రహం భార్య పాత్రలో నటించే బంపర్ ఆఫర్ తగిలింది, అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఆమెకు ఆ ఆఫర్ రావడంతో మద్రాస్ కేఫ్ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత తెలుగులో అక్కినేని వారి ఫ్యామిలీ కధా చిత్రం మనం సినిమాలో నాగచైతన్య లవర్ పాత్రలో నటించిన ఆమె మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించింది. ఇక ఆ తరువాత ఆమె రాశి ఖన్నా మళ్ళీ వెనక్కి చూసుకునే పని పడలేదు, ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, శివమ్ , బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్ , జై లవ కుశ, రాజా ది గ్రేట్ , సినిమాలు చేసి తెలుగులో సత్తా చాటగా, విలన్ సినిమాతో మలయాళ సినీ ఎంట్రీ కూడా ఇచ్చింది. తర్వాత తెలుగులో మరికొన్ని సినిమాలు చేయగా తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.

సోషల్ మీడియా వేదికగా
అయితే కొత్త హీరోయిన్స్ ఎంట్రీతో రాశిఖన్నాకు కొంత మేర గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో రాశి అందాల ఆరబోత మొదలు పెట్టింది. ఆ దెబ్బకు ఆమెకు సినిమా అవకాశాలు రావడం మళ్ళీ మొదలయ్యాయి. ఆలే ఆమె ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది రాశి ఖన్నా. అయినా సరే ఎక్కడా వెనక్క తగ్గకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ తో పాటు హాట్ ఫోటోలు కూడా తన అభిమానులతో పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. మన దగ్గర మంచి మంచి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి ఇప్పుడు తమిళ తంబీలను ఆకట్టుకునే పనిలో భాగంగా తమిళంలో వరుస సినిమాలు ఒప్పుకుని చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫోటో అయితే చర్చనీయాంశంగా మారింది.

అందాల విందు
నిజానికి కెరియర్ స్టార్టింగ్‌లో బొద్దుగా ఉండే రాశీ ఖన్నా.. ఈ మధ్య నాజూకుగా మారింది. సినిమా అవకాశాల కోసమో మరేమిటో తెలియదు కానీ ఆమె తన అందాలను బహిర్గతం చేస్తూ హాట్ హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే అదిరిపోయే హాట్ ఫొటో షూట్‌లు నిర్వహిస్తూ.. తనలోని గ్లామర్ యాంగిల్ ను తన ఫాన్స్ కు పరిచయం చేయడానికి తహతహలాడుతున్న రాశి ఖన్నా తాజాగా ఒక బటన్స్ లేకుండా షర్ట్ కిందకు లాగేసి మరీ ఉన్న ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ పిక్ లో ఆమె తన ఎద అందాలు చూపిస్తూ రచ్చ రేపుతోంది. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ అందాల ఆరబోతను చూసేయండి మరి.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే
ఇక రాశి ఖన్నా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే చివరిగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆమె చేతిలో ఇప్పుడు ఏకంగా తొమ్మిది సినిమాలు ఉన్నాయి, తుగ్లక్ దర్బార్, అరణ్మనై , భ్రమమ్, పక్కా కమర్షియల్, థాంక్యూ , సర్దార్, తిరుచిత్రం బలం, మేథావి, సైతాన్ కా బచ్చా సినిమాల్లో ఆమె నటిస్తోంది. ఇక ఆమె నటిస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











