విజయ్ దేవరకొండతో ఆ బెడ్ సీన్స్ చేయాల్సింది కాదు.. ఇష్టం లేకపోయినా తప్పు చేశాను: రాశి ఖన్నా
ఊహలు గుసగుసలాడే సినిమాతో సింపుల్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీబిజీగా మారిపోయింది. బొద్దుగా కనిపించే ఈ బ్యూటీ నేటితరం యంగ్ హీరోలకు కరెక్ట్ గా సెట్టవుతుంది. ఎలాంటి సినిమా చేసినా కూడా తనదైన శైలిలో నటిస్తూ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. అయితే ఇటీవల అమ్మడు చేసిన ఒక సినిమా అందరిని ఆశ్చర్యపరిచింది.
Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్..
లవర్స్ డే సందర్భంగా రెండు నెలల క్రితం విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఆ సినిమాలో రాశి ఖన్నాతో పాటు మరో ముగ్గురు కథానాయికలు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా విజయ్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది.

రాశి ఖన్నా షాకింగ్ రోల్..
వరల్డ్ ఫేమస్ లవర్ కథలో రాశి ఖన్నా యామిని అనే పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా ట్రైలర్ లోనే రాశి ఎవరు ఊహించని విధంగా కనిపించింది. ఆమె రొమాంటిక్ సీన్ లో బోల్డ్ గా కనిపించడం అందరికి షాకిచ్చింది. ఆ సినిమా దెబ్బకు రాశి ఇమేజ్ చేంజ్ అయిపోయింది. ఒక్కసారిగా నెటీజన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఆ బెడ్ సీన్స్ చేయాల్సింది కాదని విచారం వ్యక్తం చేస్తోంది.

చేయాల్సింది కాదు..
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి ఆ పాత్రపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'ఆ సన్నివేశాల గురించి నేను నా తల్లిదండ్రులతో చెప్పినప్పుడు వాళ్ళు కూడా కలత చెందారు. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం అనవసరం అని కూడా అనుకున్నాను. ఇలాంటి సన్నివేశాల్లో నన్ను చూడటం ముఖ్యంగా అభిమానులకు ఇష్టం లేదని నేను గ్రహించాను. నేను ఆకర్షణీయమైన సన్నివేశాల్లో నటించడం సరైందే, కాని నాకున్న ఇమేజ్ కి కొన్ని పరిమితులు ఉన్నాయి, ఇక భవిష్యత్తులో వాటిని దాటకూడదని నిర్ణయించుకున్నాను' అని రాశి వివరణ ఇచ్చింది.

ఆ దెబ్బ ఇంకా తగ్గలేదు..
ఆ ఒక్క సినిమా రాశి ఖన్నా సినీ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. గత ఏడాది ప్రతి రోజు పండగే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రాశి కొన్ని మంచి సినిమాల్లో అవకాశం దక్కించుకోవడానికి సిద్ధమైంది. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ కావడంతో ఆ దెబ్బకు చర్చల్లో ఉన్న ప్రాజెక్టులు కూడా మిస్ చేసుకోవాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఒక తమిళ్ సినిమా చేస్తున్న రాశి తెలుగులో మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications











