రాశి ఖన్నా షాకింగ్ డిసిషన్.. తెలుగు సినిమాలకు దూరంగా.. కారణమేమిటంటే
ఇటీవల టాలీవుడ్ మీడియాలో రాశి ఖన్నాకు సంబంధించిన వార్తలు ఎక్కువవా వచ్చాయి. అమ్మడిపై ఎప్పుడు లేని విధంగా ట్రోలింగ్ కూడా నడిచింది. వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమా చేయాల్సింది కాదు ఆంటు ఆమె చెప్పడం వైరల్ అయ్యింది. మళ్ళీ వెంటనే మన ఫెయిల్యూర్స్ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుందని ఒక రకమైన కొటేషన్స్ ఇచ్చింది. అమ్మడు పాజిటివ్ గానే స్పందించినప్పటికి మళ్ళీ విమర్శలకు గురికాక తప్పలేదు.
ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రాశి కెరీర్ మొదట్లో కాస్త బొద్దుగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అందుకే స్టార్ హీరోలతో ఆఫర్స్ రావట్లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక మొత్తానికి ఎదో ఒక విధంగా బరువు తగ్గి నాజూగ్గా మారిన ఈ బ్యూటీ కొంచెం కొంచెంగా స్టార్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటున్న సమయంలో వరుస అపజయాలు దెబ్బ కొట్టాయి. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అయితే కనీసం మంచి గుర్తింపు తీసుకురాకపోగా అమ్మడి ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది.

మొత్తానికి రాశి ఖన్నా ఒక నిర్ణయానికి వచ్చిందట. సహనం కోల్పోయి కోపంతో తెలుగు ఇండస్ట్రీకి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ వస్తేనే సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యిందట. ఇక ఇటీవల అమ్మడు తమిళ్ లో మంచి ఆఫర్స్ అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు కథలను ఒకే చేయడానికి రెడీ అవుతోందట. మరి పూర్తిగా కోలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న రాశి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











