Just In
- 33 min ago
KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు
- 44 min ago
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
- 1 hr ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
- 1 hr ago
సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?
Don't Miss!
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- Automobiles
భారత సర్కార్ సాయం చేసి ఉంటే రూ.5,000 లకే ఈ కార్ లభించేంది..
- News
అమరావతి ఉద్యమం 400 వ రోజు : గొల్లపూడిలో హై టెన్షన్ ; ఇంట్లోనే దీక్షకు దిగిన దేవినేని ఉమ
- Lifestyle
శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...
- Sports
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మ్యాచ్ కాపాడాడు: గవాస్కర్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ దేవరకొండ కోసం రిస్క్ చేసిన రాశీ ఖన్నా.. నలుగురు ఉన్నా ఆమెతోనే ఎక్కువ.!
అవసరాల శ్రీనివాస్ - నాగశౌర్య కాంబినేషన్‌లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా. మొదటి మూవీతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకు వెళ్తోంది. టాలీవుడ్‌లోని జూనియర్, స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న రాశీ.. అందంతో పాటు అభినయంతో రాణిస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తాజాగా ఈమె విజయ్ దేవరకొండ కోసం ఓ రిస్క్ చేసింది. ఇంతకీ ఏంటా రిస్క్? వివరాలు..

మొదట ఎంట్రీ ఇచ్చింది అక్కడే
రాశీ ఖన్నా మొదట బాలీవుడ్‌లోనే ఎంట్రీ ఇచ్చింది. ‘మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో వెండితెరపై కనిపించిన ఆమె.. ఆ తర్వాత ఆమె తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే.. మరోవైపు, మిగిలిన దక్షిణాది ఇండస్ట్రీల్లోనూ మెరుస్తోంది. దీంతో రాశీ ఖన్నా పాపులర్ హీరోయిన్ అయిపోయింది.

ఇండియన్ క్రికెటర్‌తో ప్రేమాయణం
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రాశీ ఖన్నా.. కొద్ది రోజుల క్రితం టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాతో ప్రేమాయణం సాగిస్తోందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరిని ఒకరు ఫాలో అవడంతో ఈ చర్చ తెరపైకి వచ్చింది. తర్వాత దీనికి ‘మేమిద్దరం స్నేహితులం మాత్రమే' అని రాశీ క్లారిటీ కూడా ఇచ్చేసింది.

వరుసగా రెండు హిట్లు కొట్టేసింది
రాశీ ఖన్నా ఇటీవల వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. విక్టరీ వెంకటేష్ - నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ‘వెంకీ మామ'తో పాటు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజూ పండగే' సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు చిత్రాలు పాజిటివ్ టాక్‌ను సంపాదించుకోవడంతో పాటు కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో రాబడుతున్నాయి.

విజయ్ దేవరకొండ కోసం రిస్క్
రాశీ ఖన్నా ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె బోల్డ్ క్యారెక్టర్ చేస్తోందని తాజాగా విడుదలైన టీజర్ ద్వారా అర్థం అవుతోంది. ఇందులో ఆమె టాప్ లెస్ బ్యాక్ షాట్‌లో స్నానం చేస్తూ కనిపించడంతో పాటు లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. దీంతో రాశీ ఖన్నా రిస్క్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది.

నలుగురు ఉన్నా ఆమెతోనే ఎక్కువ.!
ఈ టీజర్‌లో రాశీ ఖన్నా బోల్డ్‌నెస్ మాత్రమే హాట్ టాపిక్ కాలేదు. దీని మొత్తంలో ఆమెనే ఎక్కువ సేపు కనిపించింది. అలాగే, ఆమె పోషిస్తున్న ‘యామిని' అనే పేరే విజయ్ నోటి వెంట వినిపించింది. దీంతో ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లలో రాశీ ఖన్నా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.