Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సమంత దారిలోనే రాశి ఖన్నా.. త్వరలోనే షాకింగ్ వెబ్ సిరీస్
ఇటీవల కాలంలో స్టార్స్ చాలా వరకు ఇమేజ్ ను పక్కనపెట్టి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. చేసేది చిన్న రోల్ అయినా సరే నలుగురికి గుర్తిండి పోవాలని అనుకుంటున్నారు. ఒక విధంగా రెమ్యునరేషన్ ను లెక్క చేయకుండా నటించే వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఇక స్టార్ హీరోయిన్స్ అయితే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. ఇటీవల సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2తో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు రాశి ఖన్నా కూడా అదే తరహాలో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అవుతున్నట్లు టాక్ వస్తోంది. టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ రాశి ఖన్నా ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్రకు ఎంతో కొంత ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఆమె ఇటీవల ఒక వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది.
సోని లివ్ ప్రస్తుతం తెలుగు ఓటీటీ కంటెంట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇక రాశి ఖన్నాను లీడ్ రోల్ లో సెలెక్ట్ చేసుకొని సోని లివ్ ఒక పెద్ద వెబ్ సిరీస్ ను స్టార్ట్ చేయనుందట. అందులో ఒక ప్రముఖ కోలీవుడ్ హీరో కూడా ప్రధాన పాత్రలో నటిస్తాడని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక సమంత కంటే ముందే కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా కొన్ని వెబ్ సిరీస్ లలో నటించిన విషయం తెలిసిందే. కానీ సమంత తప్పితే మిగతా వారు అనుకున్నంతగా క్రేజ్ అందుకోలేదు. మరి రాశి ఖన్నా ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.