‘మా లెక్చరర్‌ని ఎంతో ప్రేమించా... ఎగ్జామ్ పేరుతో గదిలో సార్‌ నాతో అలా’

యువతీ యువకులు వయసులోకి వచ్చాక ప్రేమలో పడటం, ఎవరో ఒకరిని ఇష్టపడటం అందరికీ జరిగేదే. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. ఎందరో నటీనటులు తమ జీవితంలో ప్రేమించిన వ్యక్తులు, ఫస్ట్ క్రష్ అంటూ ఎన్నో సంగతులను బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ రాశీ సింగ్ తన ఫస్ట్ క్రష్, ప్రేమ విషయాలను బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఎయిర్‌ హోస్టెస్ నుంచి యాక్టర్‌గా
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాశీ సింగ్ తొలుత ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. అనంతరం సినిమాలపై ఆసక్తితో వెండితెరపై అడుగుపెట్టారు. 2021లో శశి అనే సినిమాలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్, భూతద్ధం భాస్కర్ నారాయణ, ప్రసన్న వదనం, బ్లైండ్ స్పాట్ తదితర సినిమాలలో నటించారు. అందం, అభినయం ఉన్నప్పటికీ రాశీ సింగ్‌కు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు కావొస్తున్న ఆమెకు ఇంత వరకు బ్రేక్ దక్కలేదు.

Rashi Singh Opens Up About Her First Crush and College Days Love Story

ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించిన రాశీ
మనసులో ఏ విషయాన్ని దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంలోనూ రాశీ సింగ్ వెనకడుగు వేయరు. ఇటీవల ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు మద్ధతు పలకడంతో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. సొంత జట్టుకు కాకుండా హైదరాబాద్‌కి మద్ధతుగా నిలవడం ఏంటని మండిపడ్డారు. ఆ ట్రోలింగ్‌‌కు ఘాటుగా స్పందించిన రాశీ .. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా, హైదరాబాద్‌లోనే జాబ్ చేస్తున్నా కాబట్టి ఈ నగరానికే విధేయత చూపిస్తానని తేల్చి చెప్పారు రాశీ సింగ్.

రేసులో వెనుకబడ్డ రాశీ సింగ్
ఇకపోతే..ఈ ఏడాది రాజ్ తరుణ్ సరసన చేసిన పాంచ్ మినార్‌పై రాశీ సింగ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో రాశీ కెరీర్ డైలమాలో పడింది. రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన దశలో ప్రస్తుతం మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మాణ సారథ్యంలో త్రీ రోజెస్ సీజన్‌ 2 వెబ్ సిరీస్‌లో రాశీ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా, కుషిత కళ్లపులతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. డిసెంబర్ 12 నుంచి ఈ చిత్రం ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఈ చిత్ర హీరోయిన్లను నిర్మాత ఎస్‌కేఎన్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా రాశీ సింగ్ తన క్రష్, కాలేజ్ రోజుల్లో ప్రేమాయణాన్ని బయటపెట్టారు.

రూమ్‌లో మా సార్ అలా
స్కూల్ డేస్ మొదలయ్యాకా.. ప్లస్ 2 కోసం కాలేజీలో చేరాను. అప్పుడు మా లెక్చరర్‌తో ప్రేమలో పడ్డాను. ఆయన నాకు చదువు విషయంలో ఎంతో సాయం చేసేవాడు. పరీక్షల టైంలో ముందే నాకు క్వశ్చన్ పేపర్ లీక్ చేసేవాడు. అలాగే వైవా జరిగే సమయంలోనూ నన్ను ప్రశ్నలు కూడా అడిగేవాడు కాదు. ఆ రూమ్‌లో సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. మా లెక్చరర్ కూడా చాలా యంగ్‌గా చూడటానికి ఎంతో బాగుండేవాడు. అయినా మేం హద్దు దాటలేదు. మా లెక్చరర్‌కి పెళ్లి జరగ్గా.. ఆయన ఇప్పటికీ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాడని రాశీ ఖన్నా తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: rashi singh movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X