ముందు నిన్ను నువ్వు నమ్ము అంటూ లోపలి అందాలు బయటపెట్టిన రాశిఖన్నా
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత వరుస అవకాశాలు పెట్టేస్తూ మెల్ల మెల్లగా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతోంది. గోపిచంద్‌తో 'జిల్' మూవీతో తెలుగు ఆడియన్స్ చూపు తనవైపుకు తిప్పుకున్న ఈ బొద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటోంది. తన అందాలన్నీ ఆరబోయడమే గాక తనకు సంబందించిన అన్ని విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన అందాలకు గేట్లు తెరచి ఆమె చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
ఫేమస్ ఫ్యాషన్ మ్యాగజైన్ వివా లామోర్ కవర్ పేజీని రాశి ఖన్నా అందాలతో అట్రాక్ట్ గా డిజైన్ చేశారు. ఈ పిక్ లో మునుపటి కంటే కాస్త సన్నగా కనిపిస్తున్న రాశి.. ఎద అందాలకు అందాలకు గేట్లు తెరచి ఎక్స్‌పోజ్ చేసింది. వీ కట్ నెక్ లైన్ తో ముందు భాగంలో ఓపెన్ గా ఉన్న తెలుపు రంగు దుస్తులు ధరించిన రాశిఖన్నా అందుకు తగ్గ స్టిల్ ఇచ్చింది. ఈ పిక్ ని జూన్ నెల వివా లామోర్ మ్యాగజైన్ కవర్ పేజీపై పొందుపరిచి మార్కెట్ లో పెట్టేశారు. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేసిన రాశిఖన్నా.. ''నువ్వు పడ్డ కష్టాన్ని ఎవ్వరు ఎత్తుకెళ్ళలేరు.. ఎప్పుడో ఒకసారి విజయం దక్కుతుంది.. ముందు నిన్ను నువ్వు నమ్ము.. ప్రేమతో'' అంటూ ఓ విలువైన సందేశాన్ని ఇచ్చింది. హాట్ లుక్, సెన్సేషనల్ కామెంట్ కావడంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక రాశి సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'తొలిప్రేమ' సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ రేంజ్‌కి వెళ్తుందనుకున్న తరుణంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో డీలా పడింది రాశీఖన్నా. అయినా కూడా ప్రస్తుతం ఇటు తెలుగులో అటు తమిళ్‌లో కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. 'వెంకీ మామ' సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో మరో సినిమాలో రొమాన్స్ చేస్తోంది ఈ యంగ్ బ్యూటీ.


Click it and Unblock the Notifications











