For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్ల ** కోసి పారేయాలి: ఆ దారుణంపై యాంకర్ రష్మి కోపం కట్టలు తెంచుకుంది!

  |

  మహిళల గురించిన సమస్యలు, వారిపై జరుగుతున్న అఘాయిత్యాలపై తన వాయిస్ వినిపించడంలో ముందు ఉండే తెలుగు యాంకర్, నటి రష్మి గౌతమ్ తాజాగా బీహార్‌లో జరిగిన ఓ దారుణ సంఘటన గురించి తెలిసి ఆగ్రహానికి గురయ్యారు.

  బీహార్‌ రాష్ట్రం భగల్పూర్ జిల్లాలో ఓ పదహారేళ్ల అమ్మాయి తనను గ్యాంగ్ రేప్ చేయడానికి ప్రయత్నించిన నలుగురు యువకులను అడ్డుకున్నందుకు వారు ఆమెపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటన గురించి తెలిసి రష్మి చలించి పోయారు.

  వారిది కోసి పారేయాలి అంటూ ఆగ్రహం

  వారిది కోసి పారేయాలి అంటూ ఆగ్రహం

  ‘‘ప్రతి రోజు ఏదో ఒక దారుణం.. గత సంఘటన కంటే మరింత భయానమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్న వారి పురుషాంగాన్ని కోసి పారేయాలి.'' అంటూ రష్మి ఫైర్ అయ్యారు.

  మీతో ఏకీభవిస్తున్నానని చెప్పిన రష్మి

  మీతో ఏకీభవిస్తున్నానని చెప్పిన రష్మి

  రష్మి ట్వీట్ మీద ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘ఇలాంటి పనులు చేస్తున్న వారి వల్ల వారి తల్లి దండ్రులు కూడా బ్లేమ్ చేయబడుతున్నారు. మహిళలను సెక్స్ ఆబ్జెక్టుగా చూడటం సరికాదు. జంతువుల్లా కాకుండా మనుషులుగా ప్రవర్తించాలి' అని వ్యాఖ్యానించగా... ‘నేను మీతో ఏకీభవిస్తున్నాను' అంటూ రష్మి రిప్లై ఇచ్చారు.

  స్టూడియో నుంచి బయటకు వచ్చి చూడండి

  స్టూడియో నుంచి బయటకు వచ్చి చూడండి

  మరొక నెటిజన్ స్పందిస్తూ... ‘నువ్వు ఎప్పుడూ బాధలో ఉన్న అవివాహితలా మాట్లాడతావెందుకు? ఇండియాలో మెజారిటీ ఉమెన్ వారికి కావాల్సింది చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రమే మహిళలను సరిగా ట్రీట్ చేయబడటం లేదు. అంత మాత్రాన దేశం మొత్తం అదే పరిస్థితి ఉన్నట్లు మాట్లాడవద్దు. స్టూడియో నుంచి బయటకు వచ్చి చూడండి' అని వ్యాఖ్యానించారు.

  ట్రెండింగ్: పీరియడ్స్‌పై రష్మి వాదన, నాగార్జున వార్నింగ్, బండ్ల గణేష్ పీచే ముడ్, ఆర్జీవీ కంపు!

  ఫేమ్ కోసం నా వాల్ మీద కామెంట్లు చేయవద్దు

  ఫేమ్ కోసం నా వాల్ మీద కామెంట్లు చేయవద్దు

  అతడి కామెంటుపై రష్మి రియాక్ట్ అవుతూ ‘అత్యాచారానికి గురైన వారంతా బాధలో ఉన్న అవివాహితలు కాదు, ఫేమ్ కోసం నా వాల్ మీదకు వచ్చి కామెంట్లు చేయవద్దు, వెళ్లిపో' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

  నీకు అంత స్టేటస్ రాలేదు రష్మి

  నీకు అంత స్టేటస్ రాలేదు రష్మి

  ‘‘మీ ట్వీట్ మీద కామెంట్ చేస్తే మాకు ఫేమ్ వస్తుంది అనేంత సెలబ్రిటీ స్టేటస్ మీకు ఇంకా రాలేదు. నువ్వు అలా అలోచిస్తున్నావంటే అమాయకురాలివే. 20వ ఏట నుంచే ఇండిపెండెంటుగా జీవిస్తూ... భారతీయ సమాజాన్ని ద్వేషిస్తూ, అడల్ట్ కామెడీ షోలు చేస్తున్నారు. మీ లాంటి వారు అమెరికా సొసైటీకి బాగా సూటవుతారు. భారతీయ మగాళ్లను విమర్శించడం ఆపి అమెరికా వెళ్లిపో'' అంటూ సదరు నెటిజన్ రష్మికి కౌంటర్ ఇచ్చాడు.

  మీ సొంత థియరీలు ఆపండి

  మీ సొంత థియరీలు ఆపండి

  అమెరికా వెళ్లిపోవాలంటూ అతడు చేసిన వ్యాఖ్యలపై రష్మి స్పందిస్తూ... ‘నేను ఇండియన్ సొసైటీని, ఇక్కడి మగాళ్లను ద్వేషించడం లేదు. మీ సొంత థియరీలు చెప్పొద్దు. నా వాల్ మీద నుంచి వెళ్లిపో' అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

  మగాళ్లందరిదీ కోస్తావా? మీ ఇంటి నుంచే మొదలు పెట్టు

  మగాళ్లందరిదీ కోస్తావా? మీ ఇంటి నుంచే మొదలు పెట్టు

  రష్మి చేసిన ట్వీట్ మీద మరో నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ‘ఎవరో తప్పు చేశారని అందరినీ అలాగే చూడటం సరికాదు. మేము నార్మల్ మనుషులం. మీరు ఇప్పటికీ అలాగే ఆలోచిస్తే... కోయడం మీ ఇంటి నుంచే మొదలు పెట్టండి.' అంటూ వ్యాఖ్యానించారు. దీనికి రష్మి రియాక్ట్ అవుతూ ‘నేను అందరు మగాళ్లది కోయాలి అనలేదు. నా ట్వీట్ సరిగా చదవండి' అంటూ రష్మి సమాధానం ఇచ్చారు.

  English summary
  A teenager in Bihar's Bhagalpur district was bathed with acid after she resisted an attempt to gang rape by a group of four youths. Anchor Rashmi Gautham has breathed fire on this incident. "Every day a new case and even more horrific than the last time, Chop there damn dicks off if that’s all there manhood stands for Or let the female species disappear overnight so they realise the importance of our existence." Rashmi tweeted.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X