రష్మీ గౌతమ్ హాట్ కేక్ అంటూ నిర్మాత కామెంట్స్.. అబ్బాయిలు అలా చేస్తే కుదరదంటూ రియాక్షన్

కన్నడలో భారీ విజయం సాధించిన హాస్టల్ హుదుగారు బెకడిద్దరే సినిమాను తెలుగులోకి డబ్ చేస్తున్న చిత్రం బాయ్స్ హాస్టల్ గుల్‌మోహర్ ఫిలింస్, వరుణ్ స్టూడియోస్ బ్యానర్లపై నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తెలుగులో అందిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా కొత్త నటీనటులు నటించిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, పవన్ కుమార్, తరుణ్ భాస్కర్ దాస్యం, శైనీ శెట్టి, రష్మీ గౌతమ్ తదితరులు అతిథి పాత్రలో కనిపిస్తారు. తెలుగులో సుప్రియా యార్లగడ్డ, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన ఈ సినిమా వేడుక ఇటీవల జరిగింది. రష్మీ గురించి సుప్రియ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ కామెంట్ల వివరాల్లోకి వెళితే..

సుప్రియ మాట్లాడుతూ.. బాయ్స్ హాస్టల్ అని చెబితే.. నేను మాట్లాడటానికి ఏమీ ఉండదు. నెక్ట్స్ లేడీస్ హాస్టల్ తీద్దామా అంటూ శరత్ చంద్రను ఉద్దేశించి అన్నారు. ఛాయ్ బిస్కెట్ అనురాగ్ ఒక రోజు వచ్చి.. ఓ ట్రైలర్ చూపించాడు. అదే బాయ్స్ హాస్టల్ ట్రైలర్. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నేను చాలా ఫన్, ఎమోషన్స్ ఉన్నాయి అనిపించింది. నితిన్ టీమ్ చాలా బాగా కన్నడలో చేశారు. మేకింగ్ చాలా అద్బుతంగా ఉంది అని సుప్రియ యార్లగడ్డ అన్నారు.

Rashmi Gautam

చిన్న సినిమాలు అంటూ ఏమీ ఉండవు. ఇటీవల బేబీ తెలుగులో రిలీజై గొప్ప విజయం సాధించింది. సో కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా పెద్ద సినిమానే అవుతుందని బేబీ నిరూపించింది. తెలుగు వారికి కూడా ఈ సినిమా నచ్చుతుంది అని సుప్రియా తెలిపారు. అంతలోనే వేడుక వద్దకు వచ్చిన రష్మీ గౌతమ్‌ను వేదికపైకి సుప్రియా ఆహ్వానించింది.

Rashmi Gautam

బాయ్స్ హాస్టల్ సినిమా ట్రైలర్‌లో హాట్ హాట్‌గా ఉంది. మీరు ఆ ట్రైలర్‌లో హాట్ కేకులా కనిపించావు అని నేను చెప్పగలను. కానీ శరత్ చంద్ర మాత్రం చెప్పలేరు అని సుప్రియా అన్నారు. దాంతో మనం మనం ఒకరి మీద మరొకరు సెటైర్ వేసుకొంటే పర్వాలేదు. కానీ అబ్బాయిలు సెటైర్ వేస్తే కుదరదు అని రష్మీ గౌతమ్ అన్నారు.

రష్మీ గౌతమ్ మాట్లాడుతూ... ఈ ప్రాజెక్ట్ చాలా సరదాగా గడిచిపోయింది. ప్రాజెక్టు ఒకవారంలో కన్ఫర్మ్ అయింది. షూటింగ్ కూడా బాగా జరిగింది. కన్నడలో పెద్ద హిట్ అయింది. తెలుగులో త్వరగా రావాలని కోరుకొన్నాను. అయితే తెలుగులో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. కన్నడలో కూడా సూపర్ డూపర్ హిట్. తెలుగులో కూడా అంతే విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నేను గ్లామర్ పాత్రలో కనిపించి చాలా రోజులైంది. నన్ను చాలా అందంగా ఈ సినిమాలో చూపించారు అని రష్మీ గౌతమ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X