తుపాకీ మాది, బుల్లెట్ మాదే.. కానీ మిమ్మల్ని అక్కడే చంపుతాం.. యాంకర్ రష్మీ వార్నింగ్
జమ్ము, కశ్మీర్‌లోని భారత జవాన్లపై పుల్వామా ఉగ్రదాడికి భారత సేనలు ప్రతీకారం తీర్చుకొన్నాయి. పాకిస్థాన్ ఆక్రమిత భూభాగంలో తలదాచుకొన్న జైషే ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళాలు రెండోసారి మెరుపుదాడులు చేశాయి. దాదాపు 300 మందిని మట్టుబెట్టాయి. పాక్ భూభాగంలో భారత సేనలు దాడులు చేయడం ఇది రెండోసారి. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతున్నది. ఈ ఘటనపై యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో ఏమన్నారంటే..

యాంకర్ రష్మీ ట్వీట్‌పై తలతిక్కగా
పుల్వామా దాడి తర్వాత దేశం మొత్తం భావోద్రేకంలో మునిగిపోయింది. ఆ సమయంలో రష్మీ విషాద ఘటనపై తన సందేశాన్ని, సంతాపాన్ని సైనికుల కుటుంబాలకు వ్యక్తం చేసింది. అయితే రష్మీ ట్వీట్‌కు వ్యతిరేకంగా పాక్‌కు అనుకూలంగా ఓ వ్యక్తి స్పందించడంతో వాడిని సాలే.. నువ్వు ఇక్కడ ఎందుకురా.. పాకిస్థాన్‌కు వెళ్లురా అని ఘాటుగా బదులిచ్చింది.

సర్జికల్ స్ట్రయిక్‌పై రష్మీ కామెంట్
తాజాగా పుల్వామా దుర్ఘటనకు జవాబుగా పాక్ భూభాగంపై భారత సేనలు దాడి చేయడంపై కూడా రష్మీ కామెంట్ చేశారు. భారత సేనల సేవలను, పౌరుషాన్ని కీర్తించింది. తనలోని దేశభక్తిని సోషల్ మీడియాలో చాటుకొన్నది. అయితే ఓ చక్కటి డైలాగ్‌తో రష్మీ ఆకట్టుకోవడం క్రేజీగా మారింది.

హీరో రాజ్‌కుమార్ డైలాగ్
భారత వాయు సేనల సర్జికల్ స్ట్రయిక్స్ గురించి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ పాత హిందీ సినిమాలోని హీరో రాజ్‌కుమార్ డైలాగ్‌ను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. నాకు ఈ రోజు హీరో రాజ్‌కుమార్ కొట్టిన ఫేమస్ డైలాగ్ గుర్తుకు వస్తున్నది అని ట్విట్టర్‌లో తెలిపింది.
మీ భూభాగంపైనే చంపుతాం
పాత హిందీ సినిమాలో రాజ్‌కుమార్ విలన్‌ను హెచ్చరిస్తూ.. మేము మిమ్మల్ని చంపడం ఖాయం. తప్పకుండా మిమ్మల్ని చంపుతాం. కానీ మేము చంపే తుపాకి కూడా మాదే. బుల్లెట్ కూడా మాదే ఉంటుంది. చంపబోయే సమయం కూడా మాదే అవుతుంది. కానీ ఒక్కటే తేడా మేము మిమ్మల్ని చంపే భూమి మాత్రం మీదే అవుతుంది అనే డైలాగ్‌ను నెటిజన్లతో పంచుకొన్నది.


Click it and Unblock the Notifications











