తొలిసారి ఆ సీక్రెట్ లీక్ చేసిన యాంకర్ రష్మీ: నిజమే చెప్పిందా.? పొరపాటు చేసిందా.?
బుల్లితెరపై అద్భుతమైన టాలెంట్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఆమె... ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించింది. అదే సమయంలో జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలోకి ఏ ముహూర్తాన అడుగు పెట్టిందో కానీ, రష్మీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమె ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మీ గౌతమ్ ఓ పర్సనల్ సీక్రెట్‌ను లీక్ చేసేసింది. దీని విషయంలో పొరపాటు జరిగిందా.? లేక కావాలనే చెప్పిందా.? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాలు మీకోసం.!

ఈ రెండు షోలే రష్మీని ఫేమస్ చేశాయి
దాదాపు ఏడేళ్ల క్రితం ‘జబర్ధస్త్' షో ద్వారా బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్. అప్పటి నుంచి ఆమె అందులో కొనసాగుతూనే ఉంది. దీనికి కారణం ఈ షో వల్ల ఆమెకు ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్ రావడమే. ఈ షో వల్ల ఆమె ఎన్నో ఆఫర్లు కూడా వచ్చి పడ్డాయి. ఇక, డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ' కూడా రష్మీ కెరీర్‌లో చాలా ప్రత్యేకమనే చెప్పాలి.

మరో షోలో కనిపించకపోడానికి రీజన్
రష్మీ గౌతమ్ యాంకర్‌గా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అయినప్పటికీ... ఎక్కువ షోలలో ఆమె కనిపించడం లేదు. అంటే ఆమెకు ఆఫర్లు రావడం లేదని కాదు.. వచ్చిన వాటిని తిరస్కరిస్తోందట. అవును... జబర్ధస్త్‌లో రష్మీకి భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. అంతేకాదు, ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారట. అందుకే ఆమె మరో చోటుకు వెళ్లట్లేదని టాక్.

సుధీర్ ప్రేమ వల్ల మరింత క్రేజ్ సొంతం
రష్మీ గౌతమ్ యాంకర్‌గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నదో... అంతకంటే ఎక్కువ శాతం జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ వల్ల సంపాదించుకుంది. అతడితో ప్రేమాయణం సాగిస్తుందన్న ప్రచారం వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఎన్నిసార్లు ఖండించినా ప్రచారం ఆగడం లేదు.
ఆ ఒక్కటి మినహా... అన్నీ పోయినవే
యాంకర్‌గా ఎనలేని కీర్తిని సంపాదించుకున్న రష్మీ గౌతమ్... హీరోయిన్‌గా మాత్రం మంచి గుర్తింపును అందుకోలేకపోయింది. ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసింది. వాటిలో ‘గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా హిట్ అవలేదు. ఇందులో ఆమె హాట్ షో చేసి ఈ ఫలితాన్ని రాబట్టింది. మిగిలిన వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా యావరేజ్ టాక్‌ను కూడా తెచ్చుకోలేదు.

పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన యాంకర్ రష్మీ
రాకేష్ స్కిట్‌లో భాగంగా... ఆ టీమ్‌లోని సభ్యురాలు అయిన రోహిణి ‘నీకు ఇప్పుడు ఎన్నో సంవత్సరం' అని యాంకర్ రష్మీ గౌతమ్‌ను ప్రశ్నించింది. దానికి పదహారు అని ఆమె బదులిచ్చింది. సిక్స్‌టీన్ అని ఎన్నేళ్లుగా చెబుతున్నావో అని ఆమె కౌంటర్ ఇవగా... యాంకరమ్మ ఏకంగా పదహారు అని సమాధానం చెప్పింది. దీంతో తన వయసు 32 అని పరోక్షంగా ఒప్పుకుంది.
Recommended Video

పొరపాటు చేసిందా.? నిజమే చెప్పిందా.?
గూగుల్‌లో చూపిస్తోన్న ఆమె వయసు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో రష్మీ గౌతమ్ వయసు విషయంలో ఎప్పటి నుంచో సీక్రెట్ మెయింటైన్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తన వయసు గురించి మాట్లాడడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ స్కిట్ ద్వారా తన వయసు ఇంతే అని చెప్పిందా.? లేదా తప్పు చెప్పిందా.? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


Click it and Unblock the Notifications











