నో క్లీవేజ్ షో.. నో ఎక్స్‌పోజింగ్.. నడుము చూపించనంటూ షాకిచ్చిన రష్మీ గౌతమ్
బుల్లితెర టాప్ యాంకర్‌గా రాణిస్తున్న రష్మీ గౌతమ్ అవకాశం దక్కినప్పుడల్లా బిగ్ స్క్రీన్‌పై రాణిస్తున్నారు. గతంలో వెండితెరపై గ్లామరస్ రోల్స్‌తో ఆకట్టుకొన్న రష్మీ నటనకు అవకాశం ఉన్న పాత్రలవైపు చూస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఇలాంటి క్రమంలోనే తనలోని నటిని ఆవిష్కరించుకొనేందుకు రష్మీ సరికొత్తగా రానున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇచ్చిన ఇంటర్యూ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. అందులో రష్మీ చెప్పిన విషయాలు ఏమిటంటే..
ఎద అందాలతో కనువిందు చేస్తున్న అషురెడ్డి.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్ (ఫోటోలు)

కరోనావైరస్ కారణంగా
బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా అన్ని మసాలాలు దట్టించి ప్రేక్షకుల ముందు పెట్టడానికి సిద్ధం చేశారు. కానీ కరోనావైరస్ పరిస్థితుల కారణంగా ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయాం. త్వరగా సినిమాలు రిలీజ్ చేసే అవకాశం లేదనే అందరికి తెలిసిందే. చాలా పెద్ద పెద్ద సినిమాలే ఆగిపోయాయి. మా సినిమా అందులో ఎంత అని రష్మీ చెప్పారు.

ఓటీటీలోనా? థియేటర్‌లోనా
ప్రస్తుత పరిస్థితుల్లో బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందో తెలియకుండా ఉంది. థియేటర్లలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో టీమ్ ఉంది. ఇక ఓటీటీలో వస్తుందా? లేక థియేటర్లలో వస్తుందా అనేది వేచి చూడాల్సిందే అని రష్మీ గౌతమ్ చెప్పారు.

సెక్సీ అంటూ కామెంట్ చేశారంటూ..
ఇక ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్ వేశాను. దానిని బట్టి సెక్సీ, అదీ.. ఇదీ అంటూ కామెంట్లు చేశారు. కానీ బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమాలో నా రోల్ డీ గ్లామర్ రోల్. అందులో క్లీవేజ్ షో, నడుము చూపించడాలు ఉండవు. పాత్ర కోసం నేను వేసుకొన్న క్యాస్టూమ్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. పూర్తిగా గ్లామర్‌కు దూరంగా ఉండే పాత్ర అని రష్మీ గౌతమ్ అన్నారు.

విమర్శించే వారికి సమాధానం చెబుతా
ఎప్పుడూ గ్లామరస్ రోల్స్ వేస్తారా.. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న సినిమాలు చేయారా అని చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు. అందుకే ప్రస్తుతం ఛాలెంజింగ్ ఉండే పాత్రలో కనిపించడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద కొందరు విమర్శలు చేసే వారికి సమాధానం చెప్పడానికి బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా చేశాను. తప్పకుండా వెళ్లి చూడాలని కోరుకొంటున్నాను అని రష్మీ గౌతమ్ అన్నారు.
Recommended Video

రష్మీ గౌతమ్ కెరీర్ ఇలా
రష్మీ గౌతమ్ కెరీర్ విషయానికి వస్తే.. ఢీ ఛాంపియన్స్, గర్ల్ పవర్: సరిలేరు నీకెవ్వరు, ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లాంటి షోలతో బిజిగా ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నెక్ట్స్ నువ్వే, అంతకుమించి, శివరంజని మూవీస్ తర్వాత ప్రస్తుతం బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











