ఆరోజు భయపెడతానంటున్న రష్మీ.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
నటి అవ్వాలన్న ఉద్దేశ్యంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రష్మీ గౌతమ్. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో కనిపించినా.. ఈమెకు లక్ అంతగా కలిసి రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అంత గుర్తింపు రాలేదు. దీంతో బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఫేమస్ కామెడీ షో 'జబర్దస్త్'లో అవకాశం దక్కించుకున్నప్పటి నుంచి రష్మీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ షో ఆమెకు ఎనలేని పాపులారిటీని తెచ్చి పెట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.
అందంతో ఎంతో మందిని తన వైపునకు తిప్పుకున్న ఈ హాట్ బ్యూటీ.. బుల్లితెరపైనే కాకుండా, వెండితెరపైనా అప్పుడప్పుడూ మెరుస్తోంది. అవసరం ఉన్నప్పుడు తన అందాలతో కనువిందు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు టాకీస్'లో నటించింది. ఈ సినిమాను ఆమె ఒక్కటే నడిపించింది. చిన్న సినిమాగా వచ్చినా.. ఇది మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 'నెక్ట్స్ నువ్వే' సహా పలు సినిమాల్లో నటించినా రష్మీకి అంత గుర్తింపు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

రష్మీ, నందు, ధనరాజ్, ఢిల్లీ రాజేశ్వరి ప్రధాన పాత్రధారులుగా, నల్లా స్వామి సమర్పణలో, యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, ఎ.పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు నిర్మిస్తున్న సినిమా 'శివరంజని'. హారర్ కమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి నాగ ప్రభాకర్ దర్శకుడు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అందులో ఒక యాక్సిడెంట్‌లో రష్మీ గతం మర్చిపోవడం, ఆమెని ఒక నీడ వెంటాడడం, అది నీడ కాదు దెయ్యం అని నిర్దారించుకోవడం వంటివి చూపించారు. ఇది సినిమాపై ఆసక్తిని పెంచింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది. 'శివరంజని'ని ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసేసింది. దీంతో రష్మీ అభిమానులు ఈ సినిమా కోసం సిద్ధం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











