సింగిలే... కానీ... ఇంకా తొందరలేదు – రష్మిక

చూసీ చూడంగానే అందరికీ తెగ నచ్చేసిన చిన్నది రష్మిక. చారడేసి కళ్లతో తెలుగువారిని కట్టిపాడేసే ఈ సుందరాంగి, చకచకా టాప్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుంటూ నంబర్ వన్ పొజిషన్ కు ఎగబాకేస్తోంది. ఇక వృత్తిపరంగా ఇంత బిజీగా ఉంటున్నా, అమ్మడి లవ్ స్టోరీలకు కొదవ లేదన్నది కొందరి వాదన. అయితే, ఆ వార్తలకూ చెక్ పెట్టేందుకు స్వయంగా రష్మకనే రంగంలోకి దిగింది.

టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ముందే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో పెళ్లి పీటల వరకూ వెళ్లిన రష్మిక, అక్కడతో ఆ బంధానికి చెక్ పెట్టేసి బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే, ఆ తరువాత అమ్మడు ఎవరితో కలసి నటించినా వారితో లింక్ అప్ చేస్తూ రోజుకొక వార్త పుట్టుకొస్తూనే ఉంది. విజయ్ దేవరకొండతో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందన్న వార్తలు గూప్పుమన్నాయి. వీటన్నింటికీ ఒకే ఒక్క సమాధానంతో క్లారిటీ ఇచ్చేసింది రష్మిక.

Rashmika clarifies her relationship status

ఇటీవలే ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించిన రష్మిక, తాను ఇంకా సింగిలే అంటూ క్లారిటీ ఇచ్చేసింది. వ్యక్తిగత, వృత్తిపర విషయాలను దాపరికంలేకుండా చెప్పేసింది. అంతేకాదు, సింగిల్ గానే నా జీవితం బాగుంది అంటూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.

ఒంటరితనాన్ని ఆశ్వాదించడం అలవాటు అయినప్పుడు, ప్రేమ పట్ల మరింత ఉన్నతంగా ఆలోచిస్తామని వెల్లడించింది. కాబట్టి, ఇప్పట్లో మరో బంధంలోకి అడుగుపెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పటివరకూ గ్లామరస్ రోల్స్ లోనే నటించిన ఈ కన్నడ కస్తూరి, డీ గ్లామరైజ్డ్ రోల్ లో ఎలా ఇరగదీస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X