ఇంత దారుణమా అని ఇప్పుడే తెలిసింది.. వైరల్ అవుతున్న రష్మిక ఫోటో షూట్!
Recommended Video

ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి రష్మిక సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన గీత గోవిందం చిత్రంతో సౌత్ లోనే సంచలనంగా మారిపోయింది. యువతలో రష్మికకు ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దక్షనాదిలో కొన్ని భారీ చిత్రాలలో రష్మిక అవకాశాలు అందుకుంటోంది. ఆ మధ్యన రష్మిక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక ఓ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందాలు ఆరబోయడానికి చేసిన ఫోటో షూట్ కాదు.

కాలుష్యం
మానవ మనుగడకు కారణమైన గాలి, నీరు, నేల కాలుష్యం బారీన పడుతున్న సంగతి తెలిసిందే. కాలుష్యం గురించి ప్రజలని చైతన్యపరిచే కార్యక్రమాలు ఎన్ని చేసినా ఫలితం మాత్రం సూన్యం. తాజాగా రష్మిక ఆ బాధ్యతని తీసుకుంది. సామజిక కార్యక్రమాల విషయంలో తాను కూడా ముందుంటానని రష్మిక తెలియజేసింది. నీటి కాలుష్యం గురించి చైతన్యం కలిగించేందుకు రష్మిక చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.

నీటిలో మునుగుతూ
రష్మిక ఓ కొలనులో మునుగుతున్నట్లు ఫోటో షూట్ ఉంది. చుట్టూ ప్లాస్టిక్ కవర్స్ నీటిలో తేలుతున్నాయి. మరొక చోట ప్రవహించే వాగు వద్ద రష్మిక దీనంగా చూస్తోంది. పరిశుభ్రంగా ఉన్న మరో చెరువులో రష్మిక తనివితీరా స్నానం చేస్తున్నట్లు ఉంది. నీటి కాలుష్యం గురించి అవేర్నెస్ పెంచేందుకు ఈ ఫోటో షూట్ చేశారు. ఈ ఫోటో షూట్ కు సన్మతి డి ప్రసాద్ క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

ఇంత దారుణమా
ఇండియాలో అత్యధిక కాలుష్యం ఉన్న చెరువుగా బెల్లందూర్ చెరువు నిలిచింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉందని ఈ చెరువు వద్ద షూట్ చేసే వరకు నాకు తెలియదు. ఒకప్పుడు ఈ చెరువు ఎలా ఉండేదో ఊహించుకుంటుంటే నాకు గుండె పగిలింత పని అవుతోంది. ప్రతి చోటా కాలుష్యం ఇలానే ఉంది అంటూ రష్మిక ట్విట్టర్ లో పేర్కొంది. ఆ చెరువులో ఉన్న రసాయనాల కారణంగా మంటలు కూడా చెలరేగుతున్నాయి.

వరుస చిత్రాలతో
ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక.. విజయ్ దేవరకొండ సరసన మరోమారు డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. మరో వైపు నితిన్ సరసన వెంకీ కుడుముల తెరకెక్కించబోయే సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రం డిసెంబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తమిళంలో కూడా రష్మికకు మంచి అవకాశాలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











