రష్మిక లుక్స్ పై ట్రోల్స్.. అతడిలా ఉందంటూ నేషనల్ క్రష్ పై దారుణంగా..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్‌లో ఓ రేంజ్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. ఈ రేంజ్‌లో అయితే మన సౌత్ సినిమా నుంచి దాదాపు కనిపించరు. కానీ ఈ కొలమానాలు అన్నిటికీ సమాధానంగా ఒక్క హీరోయిన్ మాత్రం సౌత్ నుంచి వెళ్లి పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నానే..

ఇపుడు రష్మికకి ఉన్న డిమాండ్ కానీ తన లైనప్ కోసం కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలతో పాటుగా రీసెంట్‌గానే తన రిలేషన్‌షిప్ స్టేటస్ పై కీలక కామెంట్స్ చేసి రష్మిక వార్తల్లో నిలిచింది. అయితే రష్మిక మందన్నాకి ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో తనపై కొంచెం నెగిటివిటీ కూడా ఉందని చెప్పాలి. కాగా రష్మిక నటన పరంగా అలాగే తన లుక్స్ పరంగా సోషల్ మీడియాలో కొన్ని సినిమాలకి గతంలో ట్రోల్స్ బారినపడ్డారు.

rashmika got trolled brutelly by her looks in pushpa 2 promotions

అయినప్పటికీ వాటిని తట్టుకొని నిలబడింది. తన సినిమాలు , హార్డ్ వర్క్ తోనే అందరికీ సమాధానం ఇచ్చిన నేషనల్ క్రష్ ఇపుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురి కావాల్సి వచ్చింది. ఇపుడు రష్మిక చేసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం "పుష్ప 2" పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో కలిసివున్న ఓ పిక్ బయటికి వచ్చింది.

దీనితో ఈ పిక్ చూసిన అంతా ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో తనను ట్రోల్స్ చేస్తున్నారు. ఇదెందుకు అంటే ఆమె లుక్స్ అంతా డిఫరెంట్‌గా ఆ పిక్‌లో ఉన్నాయి. స్టైల్‌గా డ్రెస్సింగ్ చేసుకుని, ఒక మంచి గాగుల్స్ పెట్టుకున్న రష్మిక అచ్చం పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్‌లా ఉంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ విత్ మైఖేల్ జాక్సన్ అంటూ సోషల్ మీడియాలో రష్మిక లుక్స్ పై ఇపుడు ట్రోల్స్ పడుతున్నాయి.

దీనితో ఇది ఫన్నీగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కానీ ఇది తనకి ఒకింత అవమానమే అని చెప్పి తీరాలి. ఈమెకి లుక్స్ పరంగా మైఖేల్ జాక్సన్ లా ఉంది అంటూ కెరీర్ స్టార్టింగ్‌లోనే పలు ట్రోల్స్ పడ్డాయి. మళ్ళీ ఇన్నాళ్లకి సోషల్ మీడియాలో అదే తరహాలో రష్మికను అంటున్నారు. సో మొత్తానికి ఇలా మళ్ళీ రష్మిక తన లుక్స్ పరంగా బుక్కయ్యిపోయింది అని చెప్పాలి.

రీసెంట్ గానే రష్మిక పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చింది. ఇక పుష్ప2ని సుకుమార్ తెరకెక్కించగా ఈ డిసెంబర్ 5న సినిమా భారీ లెవెల్లో 2డి, 3డి వెర్షన్ లలో డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X