19 ఏళ్ల వయసులో రష్మికా ఫస్ట్ ఆడిషన్ చూసారా.. నెట్టింట నేషనల్ క్రష్ వీడియో వైరల్
ఒక్క దక్షిణాది సినిమా దగ్గర మాత్రమే కాకుండా టోటల్ పాన్ ఇండియా వైడ్ గా మంచి బిజీగా ఒకప్పుడు నార్త్ ఇండియా బ్యూటీస్ ఉండేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దీనితో ఇపుడు సౌత్ ఇండియా నుంచే హీరోయిన్స్ టోటల్ పాన్ ఇండియా సినిమాని చేట్టేస్తున్నారు. కాగా ఇలా ప్రెజెంట్ ఫుల్ బిజీ అండ్ మంచి డిమాండ్ తో దూసుకెళ్తున్న యువ హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ హీరోయిన్ రష్మికా మందన్నా కూడా ఒకరు.
కాగా రష్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పాగా వేసేసింది. కాగా ఇప్పుడు హిందీ సినిమాలో కూడా ఫుల్ బిజీగా మారిపోయి పలు భారీ సినిమాలు చేతిలో పెట్టుకొని మంచి డిమాండ్ తో దూసుకెళ్తుంది. అయితే ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా కూడా తమ నటనతో ఆడియెన్స్ కంటే ముందు చిత్ర యూనిట్ ని మెప్పించాల్సి ఉంటుంది.

కాగా అందుకే ఎన్నో సినిమాలకి చాలా మంది నటీనటులు కాళ్ళకి చెప్పులు అరిగేలా ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి ఇప్పుడు మంచి స్టేటస్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు రష్మికా హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఎన్నో సినిమాల కోసం తిరిగి తిరిగి ఆడిషన్స్ ఇచ్చాడు. తనవి పలు వీడియోలు కూడా ఆ మధ్య వైరల్ అయ్యాయి. కానీ ఇపుడు రష్మిక వంతు వచ్చింది.
మరి రష్మిక మందన్నా వయస్సు ఇప్పుడు 28 ఏళ్ళు కాగా రష్మిక తన 19వ ఏట నుంచే సినిమాలకి ట్రై చేయడం మొదలు పెట్టింది. అలా తన 19వ ఏటా ఇచ్చిన ఆడిషన్ తాలూకా క్లిప్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా రష్మికా నేటివ్ ప్రాంతం కర్ణాటక అని చాలా మందికి తెలిసిందే. కాగా తన మొదటి ఆడిషన్ కూడా కన్నడలోనే అందించింది. అయితే అప్పుడుకి ఇప్పుడుకి రష్మికా అదే లుక్స్ లో ఉందని చెప్పాలి.
అలాగే ఈ వీడియోలో అయితే రష్మిక తనదైన పెర్ఫామెన్స్ ని ఈ ఆడిషన్ లో పలు గెటప్స్ అలాగే పలు వేరియేషన్స్ ని చూపిస్తూ అలవోకగా చేసేసింది. దీనితో ఎన్నో ఏళ్ల కితపు తన వీడియో ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పాలి. కాగా ఇప్పుడు రష్మిక తన అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో "పుష్ప 2 ది రూల్" సీక్వెల్ తో ఈ ఏడాదిలో రాబోతుండగా దీని తర్వాత మరిన్ని భారీ సినిమాలు ఆమె చేస్తుంది.
తమిళ హీరో ధనుష్ తో "కుబేర", బాలీవుడ్ మరో బిగ్ ప్రాజెక్ట్ ఆనిమల్ తర్వాత స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అలాగే హీరో దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో చేస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ "సికందర్" సినిమాలో బిజీగా ఉంది. ఇక ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఇప్పుడు రష్మిక పాన్ ఇండియా భాషల్లో చేస్తూ ఫుల్ బిజీ షెడ్యూల్ ని కంటిన్యూ చేస్తుంది.


Click it and Unblock the Notifications











