ధోని రనౌట్ కావడంతో గుండె పగిలినంత పనైంది.. రష్మిక మందన్న
గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న చిత్ర డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ద్వారా భరత్ కమ్మ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ పిక్చర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. జూలై 26న రిలీజ్ అవుతున్న క్రమంలో హీరోయిన్ రష్మిక మందన్న తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఈ చిత్రంలో రష్మిక స్టేట్ లెవెల్ క్రికెటర్‌గా కనిపించబోతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ గురించి ఆమె ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
నా జీవితంలో నేను ఎన్నడూ క్రికెట్ ఆడలేదు. క్రికెట్ గురించి అసలే తెలీదు. స్విమ్మింగ్ ఇతర ఆటలు నాకు తెలుసు. డియర్ కామ్రేడ్ సినిమా విషయానికి వచ్చే సరికి క్రికెటర్‌గా కనిపించాలి. దాంతో శిక్షణ అవసరం అయింది. నాలుగు నెలలు కష్టపడి క్రికెట్ గురించి నేర్చుకొన్నాను. ఇప్పుడు క్రికెట్ స్ట్రయిట్ డ్రైవ్, ఆఫ్ డ్రైవ్, లాంగ్ ఆన్, ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్ లాంటి పదాలు నేర్చుకొన్నాను. ఫీల్డింగ్ చేయాల్సి రావడంతో దెబ్బలు కూడా తగిలాయి. కొన్నిసార్లు బాల్ బౌన్స్ కావడంతో ముఖంపై కూడా దెబ్బలు తగిలాయి.

ఒకప్పుడు క్రికెట్ నాకు తెలియదు. కానీ క్రికెట్ అంటే ప్రేమ పెరిగింది. ఇప్పుడు ఫోర్లు కొడుతున్నాను. సిక్సర్లు కొట్టడం నా వల్ల కాదు. నేను ఇప్పుడు క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. సినిమాలో క్రికెటర్‌గా నా పాత్రకు చాలా స్కోప్ ఉంది. తెరపైన నన్ను క్రికెటర్‌గా చూసి మెచ్చుకొంటారనే అనుకొంటున్నాను అని రష్మిక తెలిపింది.
తొలిసారి నేను ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు చేశాను. ధోని రనౌట్ అవుతుంటే చూసి తట్టుకోలేదు. క్రికెట్ మైదానంలో దేశం కోసం అంతలా శ్రమ పడుతుంటే నాలో టెన్షన్ పెరిగింది. దేశం కోసం క్రికెట్ ఆడే ఆటగాళ్లపై గౌరవం పెరిగింది. వారంటే నాకు కలిగిన అభిమానం ఎంత ఎత్తులో ఉందో మాటల్లో చెప్పలేను అని రష్మిక అన్నారు.


Click it and Unblock the Notifications











