For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవరైనా ప్రేమిస్తే.. అలా రియాక్ట్ అవ్వాలి.. రష్మిక మందన్నకు తండ్రి చెప్పిందేమిటంటే..

|

ఛలో, గీతా గోవిందం, దేవదాస్ చిత్రాలతో దుమ్మురేపిన రష్మిక మందన్న భారీ అవకాశాలను దక్కించుకొంటూ దక్షిణాదిలో దూసుకెళ్తున్నది. గ్లామర్ పంట పండిస్తూనే.. మరో ఫెర్ఫార్మెన్స్‌తో పాత్రలను ఇరుగదీస్తున్నది. తాజాగా ఆమె నటించిన డియర్ కామ్రేడ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..

 వచ్చే రెండేళ్లు బిజీగా

వచ్చే రెండేళ్లు బిజీగా

వరుసగా భారీ ప్రాజెక్టులతో వచ్చే రెండేళ్లు బిజీగా ఉన్నాను. దక్షిణాదిలో ఐదు సినిమాల్లో పనిచేస్తున్నాను. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్నాను. బిజీగా ఉండటం నాకు ఇష్టం. క్షణం తీరిక లేకుండా పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇంకా మరెన్నో సినిమాలు చేయాలని ఆశగా ఉంది. ఇప్పడిప్పుడే ఇండస్ట్రీలో బుల్లి అడుగులు వేస్తున్నాను అని రష్మిక చెప్పారు.

హీరోయిన్‌కు రోల్ అలా ఉండాలి

హీరోయిన్‌కు రోల్ అలా ఉండాలి

కమర్షియల్ సినిమానా? నాన్ కమర్షియల్ సినిమానా అనే విషయాన్ని పట్టించుకోను. కాకపోతే హీరోయిన్‌కు బలమైన పాత్ర ఉండాలి. గ్లామర్ సీన్ల కోసమో.. డ్యూయెట్ల కోసమే సినిమాలు చేయను. నాకంటూ ఓ గుర్తింపు ఉండే పాత్రలనే చేయాలని అనుకొంటున్నాను. బలమైన కథ ఉంటే, ఫెర్ఫార్మెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి సినిమాలనే ఎంపిక చేసుకొంటాను అని రష్మిక అన్నారు.

 మహేష్, నితిన్, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోలతో

మహేష్, నితిన్, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోలతో

టాలీవుడ్‌లో కేవలం మూడు సినిమాల్లో నటించిన అనుభవంతో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు? అల్లు అర్జున్‌తో ఐకాన్, నితిన్‌తో భీష్మ లాంటి సినిమాలు చేసే అవకాశం రావడం నిజంగా అద‌ృష్టంగా భావిస్తాను. ఛలో సినిమా తర్వాత మళ్లీ వెంకీ కుడుములతో పని చేయడం హ్యాపీగా ఉంది. తక్కువ సినిమాలతోనే నాకు భారీగా ఫ్యాన్స్ ఏర్పడటం ఆనందంగా ఉంది అని రష్మిక పేర్కొన్నారు.

ప్రేమ చూపిస్తే అలా చేయ్యమని

ప్రేమ చూపిస్తే అలా చేయ్యమని

అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు చూపే ప్రేమ, ఆదరణలో తడిసిపోతున్నాను. నాకు అభిమానులే బలమని నమ్ముతాను. ఎవరైనా ప్రేమ చూపిస్తే వారికి ఓ చిరునవ్వుతో ప్రేమను పంచమని మా నాన్న చెప్పాడు. అప్పుడు నీకు ఎనలేని ప్రేమ లభిస్తుంది. నాన్న చెప్పిన ప్రాథమిక సూత్రం నా కెరీర్‌కు బాగా ఉపయోగపడింది. అందుకే నేను ఎవరిని నొప్పించను. ఎవరైనా తప్పుగా మాట్లాడినా.. ఓపిక, సహనంతో సమాధానం ఇస్తాను అని రష్మిక చెప్పారు.

సినిమాకు వందశాతం న్యాయం

సినిమాకు వందశాతం న్యాయం

ఏదైనా సినిమాకు పనిచేస్తే.. నా పార్ట్ అయిపోయిన తర్వాత గుడ్ బై చెప్పను. డబ్బింగ్‌లో యాక్టివ్‌గా ఉంటాను. ఎడిటర్‌తో కలిసి కూర్చొని పనిచేస్తాను. ఇతర టెక్నిషియన్స్‌ నుంచి చాలా విషయాలు తెలుసుకొంటాను. కొందరికి ఇలాంటి విషయాలు నచ్చవు. అయినా నా పంథాను మార్చుకొను. సినిమాకు వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. డియర్ కామ్రేడ్ ప్రొడక్షన్‌లో పాలు పంచుకొన్నాను అని అన్నారు.

English summary
South Indian star Rashmika Mandanna, Now coming with Vijay Deverakonda in Dear Comrade. Now she has three bigg projects with Mahesh Babu, Nithin, Allu Arjun. In this occassion, She shared her views about personal and professional life.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more