ప్రతి ఒక్కరితో ఆ సంబంధం అంటగట్టే వారికి చెబుతున్నా.. నాకు అలా ఉండడమే ఇష్టం: రష్మిక మందన్న
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో చాలా వేగంగా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న బ్యూటీ రష్మిక మందన్న. ఆమె అదృష్టి ఏమిటో గాని ఒక సినిమా యావరేజ్ అయితే వెంటనే మరో సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకుంటోంది. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో గ్యాప్ లేకుండా భారీ ఆఫర్స్ ని పట్టేసింది. ఇక ఈ బ్యూటీ తన రిలేషన్షిప్ పై మరోసారి వివరణ ఇచ్చింది.

ప్రేమలో ఉన్నట్లు రూమర్స్
ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మొదట్లోనే మంచి మంచి కథలను సెలెక్ట్ చేసుకుంది. ముఖ్యంగా గీత గోవిందం సినిమా ఆమె కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. అసలు మ్యాటర్ లోకి వస్తే రష్మిక చాలా రోజుల తరువాత రూమర్స్ పై వివరణ ఇచ్చింది. ఆమె ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో కూడా రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఆ హీరోతో రష్మీక పెళ్లి..?
ఇక కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్న తరువాత ప్రియుడి నుంచి విడిపోయిన రష్మిక అప్పటి నుంచి కెరీర్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. కానీ ఆమె మళ్ళీ ప్రేమలో పడినట్లు రూమర్స్ గట్టిగానే వచ్చాయి. ఆల్ మోస్ట్ ఒక హీరోను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. మొదట్లో ఆ కథనాలపై పెద్దగా స్పందించని రష్మిక డోస్ ఎక్కువైతే మాత్రం వెంటనే రియాక్ట్ అవుతోంది.

సింగిల్ గానే ఉన్నాను
ఇటీవల ఆమె సోషల్ మీడియా ద్వారా ఒక వివరణ ఇచ్చింది. నేను ప్రేమలో ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరితో నాకు సంబంధం ఉన్నట్లు కామెంట్ చేసేవారికి ఈ సమాధానం చెబుతున్నా. నేను సింగిల్ గానే ఉన్నాను. అలా ఉండడమే నాకు ఒక ప్రేమతో సమానం. అలాగే సింగిల్ గా ఉండేవాళ్లకు కూడా ఈ విషయాన్ని చెబుతున్నా అని తెలిపింది.

సింగిల్ గా ఉన్నప్పుడు
నన్ను నమ్మండి సింగిల్ గా ఉన్నప్పుడు సరదగా సంతోషంగా ఉంటే మిమ్మల్ని ఎవరైనా సరే అమితంగా ఇష్టపడతారని కూడా రష్మిక వివరణ ఇచ్చింది. దీంతో రష్మీక ప్రేమలో ఉన్నట్లు వస్తున్న రూమర్స్ కి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఆ సినిమాకు సుకుమార్ దర్శకుడు.


Click it and Unblock the Notifications











