నా కాబోయే భర్త అలా ఉండాలి.. విజయ్ దేవరకొండతో అఫైర్ గురించి రష్మిక క్లారిటీ

Recommended Video

Rashmika Mandanna About His Future Life Partner || Filmibeat Telugu

కన్నడ బ్యూటీ దక్షిణాది చిత్ర పరిశ్రమలో పాగా వేసేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నట్టు కనిపిస్తున్నది. తెలుగులో ఛలో, గీత గోవిందం, దేవదాస్ చిత్రాల విజయం తర్వాత ఇప్పుడు పూర్తిగా నాలుగు భాషలపై కన్నేసింది. తాజాగా ఆమె నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజై మిశ్రమ స్పందనను కూడగట్టుకొన్నది. తాజాగా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను మీడియాతో పంచుకొన్నది. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

గీత గోవిందం తర్వాత

గీత గోవిందం తర్వాత

తెలుగులో గీతా గోవిందం సినిమా రిలీజ్‌కు ముందు కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మికకు జరిగిన నిశ్చితార్థం బ్రేక్ అయింది. దాంతో పలు రకాల గుసగుసలు వినిపించాయి. అంతేకాకుండా గీత గోవిందంలో విజయ్‌తో లిప్ లాక్ చేయడంపై నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా కెరీర్‌పైనే దృష్టిపెట్టింది.

డియర్ కామ్రేడ్ సమయంలో

డియర్ కామ్రేడ్ సమయంలో

గీత గోవిందం తర్వాత వరుసగా రెండో ప్రాజెక్ట్‌ డియర్ కామ్రేడ్ చేయడంతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన మధ్య అఫైర్ కొనసాగుతుందనే విషయం గుప్పుమన్నది. అయితే అటు విజయ్ గానీ, రష్మిక గానీ స్పందించలేదు. కానీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య అలాంటి రిలేషన్ లేదని, ఎవరైనా అలాంటి రూమర్లు ప్రచారం చేస్తే దానికి నా చిరునవ్వే సమాధానం అని రష్మిక వివరణ ఇచ్చింది.

నా భర్త ఎలా ఉండాలంటే

నా భర్త ఎలా ఉండాలంటే

అయితే తన జీవితంలోకి ప్రవేశించే జీవిత భాగస్వామి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నా కాబోయే వ్యక్తిగా బాగా మాట్లాడుతాడా? లేదా బిడియంతో బిగుసుకుపోతాడా అనే విషయాన్ని నేను పట్టించుకొను. నిజాయితీ కూడిన వ్యక్తి అయి ఉండాలి. సమయస్ఫూర్తి ఉండే వ్యక్తులంటే నాకు ఇష్టం. అతడితో ఎక్కువ సేపు సమయాన్ని గడపాలనే కోరిక కలిగేలా వ్యవహరించాలి అని రష్మిక పేర్కొన్నారు.

వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ సరే

వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ సరే

నాకు లభించబోయే వ్యక్తికి నాకు వయసులో చాలా వ్యత్యాసం ఉన్నా పర్వాలేదు. కానీ ప్రేమను పంచే వ్యక్తి అయి ఉండాలి అని రష్మిక స్పష్టం చేశారు. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ రంగంలో ప్రవేశించిన రష్మిక తన సహచర హీరో రక్షిత్‌ శెట్టి ప్రేమలో పడింది. 2017లో వారికి నిశ్చితార్థం జరిగింది. వ్యక్తిగత అభిప్రాయాలు నెలకొనడంతో వారి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X