అలాంటి సినిమాలు నాకు నచ్చవు.. అందుకే నో.. రష్మిక
కిరిక్ పార్టీతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న వరుస విజయాలతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నారు. ఆమె నటించిన ఛలో, గీత గోవిందం, దేవదాస్ సక్సెస్ సాధించాయి. తాజాగా విజయ్ దేవరకొండతో మరోసారి జతకట్టి నటించిన డియర్ కామ్రేడ్ కూడా సక్సెస్ వైపు దూసుకెళ్తున్నది. ఈ సందర్భంగా రష్మిక మీడియాతో మాట్లాడుతూ.. నాకు కమర్షియల్ సినిమా ఆఫర్లు చాలానే వస్తున్నాయి. కానీ నేను అంగీకరించడం లేదు అని అన్నారు.
హీరోలతో డ్యాన్సులు చేసే పాత్రలు, గ్లామర్ పంట పడించి రోల్స్ నా వద్దకు చాలానే వచ్చాయి. ప్రస్తుతం ప్రేక్షకుల్లో నాకు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను అని రష్మిక చెప్పారు. చాలా మంది కమర్షియల్ రోల్స్ ఇవ్వడానికి ముందుకొస్తే సున్నితంగా తోసిపుచ్చాను అని అన్నారు.

కమర్షియల్ సినిమాల్లో నటిస్తే మరో 15 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటాను. కానీ హీరోయిన్ నేపథ్యం ఉండే పాత్రల్లో నటిస్తే చిరకాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాం అని అన్నారు. అందుకే మసాలా పాత్రలను అంగీకరించడం లేదు అని అన్నారు. డియర్ కామ్రేడ్ తర్వాత తెలుగులో మహేష్, నితిన్, అల్లు అర్జున్ సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యారు. తమిళంలో కార్తీ సరసన మరో సినిమాలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











