రష్మీకకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా.. హోటళ్లలో రహస్యంగా అలాంటి పనులు

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పాలని చూస్తున్న బ్యూటీలలో రష్మీక మందన్న ఒకరు. సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో ఈ మధ్య పూజా హెగ్డేతో పాటు ఈ కన్నడ బ్యూటీ కూడా గట్టి పోటీని ఇస్తోంది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు ముచ్చటించిన రష్మీక తన పర్సనల్ విషయాల గురించి చాలానే మాట్లాడింది. ఏ మాత్రం మొహమాటం లేకుండా కొన్ని సీక్రెట్స్ ని కూడా చెప్పేసింది.

స్టార్ హీరోలతో కూడా...

స్టార్ హీరోలతో కూడా...


ఛలో సినిమాతో టాలీవుడ్ కి పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చిన రష్మీక తరువాత చూస్తుండగానే వరుస బాక్సాఫీస్ హిట్స్ తో లక్కీ గర్ల్ గా మారిపోయింది. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈ బ్యూటీకి మంచి బూస్ట్ ఇచ్చింది. మొత్తానికి స్టార్ హీరోలతో కూడా హిట్స్ అందుకోగలనని కూడా నీరూపించింది. ఇక రష్మీకకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ లో ఫాలోయింగ్ గట్టిగానే పెరుగుతోంది.

హోటల్స్ లలో అలాంటి పనులు..

హోటల్స్ లలో అలాంటి పనులు..

రీసెంట్ గా ఈ బ్యూటీ తనలోని ఒక కొత్త కోణాన్ని బయటపెట్టింది. షూటింగ్స్ నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లే రష్మీక ఒక విషయంలో మాత్రం తన అలవాటును మార్చుకోలేకపోతోందట. ఎక్కడైనా హోటల్స్ లో దిగితే నచ్చిన షాంపూ బాటిల్స్ కనిపిస్తే వెంటనే దొంగతనం చేస్తుందట. ఎవరు పసిగట్టకుండా రహస్యంగా తన బ్యాగ్ లో వేసుకొని సైలెంట్ గా వెళ్లిపోతుందట. ఇటీవల ట్విట్టర్ లైవ్ సెషన్ లో రష్మీక ఈ విషయం గురించి బయటపెట్టింది.

ఇక నుంచి జాగ్రత్తగా ఉండు..

ఇక నుంచి జాగ్రత్తగా ఉండు..


అలాగే కొన్నిసార్లు పిల్లో కవర్స్ ని కూడా దొంగలించిందట ఈ బ్యూటీ. రష్మీక ఆ విషయాన్ని చెప్పగానే నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నీలో ఇలాంటి అలబాట్లు కూడా ఉన్నాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నీ దొంగ బుద్దిని బయటపెట్టావ్ గా.. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Thaman Vs Devi Sri Prasad : Musical Fight In Tollywood
 రిజెక్ట్ చేయడం వలన ఇబ్బందులు..

రిజెక్ట్ చేయడం వలన ఇబ్బందులు..

గతంలో కూడా రష్మీక తన చిన్ననాటి దొంగతనాల గురించి చాలానే చెప్పింది. ఒక సందర్భంలో తోటలో పండ్లను దొంగిలిస్తుంటే ఒక ఆంటీ కర్ర పట్టుకొని కొట్టడానికి వచ్చిందని చెప్పింది. అదే విధంగా ప్రతి విషయానికి ఎక్కువగా నవ్వడం వలన ఇబ్బందులు వస్తున్నాయని ఒక వేళ ఎవరినైనా రిజెక్ట్ చేసినా కూడా నవ్వుతూనే రిజెక్ట్ చేస్తానని తెలిపింది. కానీ ఆ తరువాత ఎదుటివారు కొంత కన్ఫ్యూజన్ కి గురవుతారని చెబుతూ తానొక గ్రహాంతరవాసిలా ఫీలవుతుంటానని వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X