త్వరలోనే అతడితో.. హాట్ న్యూస్‌పై రష్మిక మందన్న క్లారిటీ!
కన్నడ భామ రష్మిక మందన్న దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ అవకాశాలతో దూసుకెళ్తున్నారు. వరుస విజయాలు ఆమెను పలుకరిస్తుండటంతో ఎక్కువ మంది నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా రష్మిక ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్నది. ఇటీవల తమిళ సూపర్‌స్టార్ విజయ్‌తో నటిస్తున్నట్టు వచ్చిన వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది. వివరాల్లోకి వెళితే..

విజయ్ సినిమాలో నటిస్తున్నావా?
విజయ్, అట్లీ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో చేస్తున్నావా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. కానీ ఈసారి ఆఫర్ రాలేదు. త్వరలోనే వారితో కలిసి పనిచేస్తాను అని రష్మిక సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

త్వరలోనే కోలీవుడ్‌లోకి
నాపై ఇంతగా ప్రేమను చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే తమిళంలోకి ప్రవేశిస్తున్నాను. నిజంగా మీ అభిమానానికి ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ప్రేమకు మరోసారి థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అని రష్మిక తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాజమౌళి మూవీలో
ఇక రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న RRR చిత్రంలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ రష్మిక పేరును దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. ఒకవేళ RRR చిత్రంలో నటించే అవకాశం లభిస్తే నిజంగా రష్మిక కెరీర్ మరో మెట్టు ఎక్కే అవకాశం లేకపోలేదు.

వరుస సక్సెస్‌లతో
టాలీవుడ్‌లో రష్మిక మందన్న నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. ఛలో, గీత గోవిందం, దేవదాస్ చిత్రాలు ఆమెను హాట్ హీరోయిన్‌గా మార్చాయి. విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్, నితిన్‌తో ఓ చిత్రం, కన్నడలో మరో చిత్రంలో నటిస్తున్నది. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.

రక్షిత్‌తో బ్రేకప్ జరుగడంతో
రష్మిక కెరీర్ రాకెట్‌లా దూసుకుపోతున్న నేపథ్యంలో వ్యక్తిగతం జీవితంలో చిన్న దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో జరిగిన పెళ్లి నిశ్చితార్థం రద్దు కావడంతో కొంత మానసిక సంఘర్షణకు రష్మిక లోనయ్యారు. ప్రస్తుతం కెరీర్‌పైనే ఫోకస్ చేస్తున్నట్టు చెప్పారు.


Click it and Unblock the Notifications











