Rashmika Mandanna ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పబ్లిక్‌లోనే రష్మిక అలా.. స్పైసీ వీడియో వైరల్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ ఆమె. స్టార్ హీరోల సినిమాల నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాల వరకు అన్నీ రష్మిక కాల్ షీట్స్ కోసమే వెయిటింగ్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి పబ్లిక్‌లోనే ఓ స్పైసీ మత్తెక్కించే ఘాటు వీడియో చేసింది. ప్రస్తుతం అది నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. మరి ఇంతకీ ఆ సంగీత దర్శకుడు ఎవరు?, అసలు వారేం వీడియో చేశారు? ఇప్పుడు దాని గురించే ఈ కథనం..
హీరోయిన్ రష్మిక ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ హీరోయిన్ తన క్యూట్ అండ్ స్మైల్ యాక్టింగ్‌తో నేషనల్ వైడ్‌గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. . ఆమెకు సంబంధించిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. తెలుగులో ఛలో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆ తర్వాత గీతా గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ, పుష్ప వంటి చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. బాలీవుడ్‌లోనూ మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో పాటు రీసెంట్గా యానిమల్ చిత్రం చేసి మరింత క్రేజ్‌ను దక్కించుకుంది.

నేషనల్ వైడ్‌గా ఆమెకు దక్కిన క్రేజ్‌తో పలు బిజినెస్ బ్రాండ్స్ కూడా తమ ప్రమోషన్స్ కోసం రష్మిక ఇమేజ్ను వాడుకుంటున్నాయి. ఆమెతో డీల్స్ చేసుకుంటూ యాడ్స్ చేస్తున్నాయి. అలా తాజాగా కూల్ డ్రింక్ ప్రోడక్ట్ 7upకు సైన్ చేసింది రష్మిక. దీంతో ఓ కొత్త యాడ్‌ను చిత్రీకరించి దాన్ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో రష్మికతో పాటు కోలీవుడ్ రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరూధ్ కూడా నటించారు. యాడ్ చూడడానికి సినిమాటిక్‌గా ఎంతో బాగుంది. స్పైపీ స్పైసీ అంటూ యాడ్‌ను అద్భుతంగా చిత్రీకరించారు.

వీడియోలో రష్మిక స్పైసీ ఫుడ్ తినడానికి ఓ మొబైల్ క్యాంటీన్‌కు వస్తుంది. అక్కడ చెఫ్‌గా ఉన్న అనిరూధ్ ఫుడ్‌ను తయారు చేసి ఇస్తాడు. అది తిన్న రష్మిక తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఘాటుగా ఉందంటూ చెబుతుంది. ఈలోగా 7up వ్యాన్‌తో వచ్చి అనిరూధ్ సర్ప్రైజ్ ఇస్తాడు. వెంటనే దాన్ని తాగిన రష్మిక కూల్ అవుతుంది. అలా ఆద్యంతం ఈ యాడ్ కూల్ అండ్ సినిమాటిక్‌గా సాగింది. దానినే రష్మిక తన ఇన్‌స్టాలో తాజాగా పోస్ట్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాడ్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే రష్మిక మరో పోస్ట్‌తో తన ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. తాను చావు నుంచి తప్పించుకున్నట్లు ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే రష్మిక, శ్రద్దా కలిసి ముంబ నుంచి హైదరాబాద్‌కు విమానంలో బయలుదేరగా అది సాంకేతిక లోపం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దానినే రష్మిక పోస్ట్ చేసి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాం అని చెప్పింది.


Click it and Unblock the Notifications











