Rashmika Mandanna: ఆ విషయంతో రాజీ పడ్డా.. నేషనల్ క్రష్ ఎమోషనల్
Rashmika Marriage: రష్మిక మందాన.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారింది. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. కుర్రకారు గుండెల్లో కలల రాణిగా ముద్ర వేసుకుంది. వరుస విషయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తాజాగా పుష్ప 2 సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. అయితే.. తన సక్సెస్ కోసం ఎన్నో విషయాల్లో రాజీ పడ్డానని నేషనల్ క్రష్ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ రష్మిక కెరీర్ లో సక్సెస్ కావడం చేసిన త్యాగమేంటీ?
రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్ లో వరుస విషయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ' పుష్ప 1' సినిమాతో ఈ అమ్మడు నేషనల్ క్రష్ గా మారింది. ఇలా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఈ అమ్మడు సందీప్ రెడ్డి వంగ 'యానిమల్'లో నేషనల్ క్రష్ గా మారింది. తాజాగా పుష్ప 2 ది రూల్'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక. తన నటన ప్రశంసలు అందుకుంది.

తాజాగా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛావా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించగా.. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించారు. ఇందులో రష్మిక శంభాజీ భార్య ఏసుబాయిగా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషనల్స్ లో రష్మిక బిజీగా ఉంది. ఇదిలాఉంటే.. 'సికందర్', 'థామ', 'కుబేర', 'ది గర్ల్‌ఫ్రెండ్', 'రెయిన్ బో' వంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది నేషనల్ క్రష్ రష్మిక .
ఇదెలా ఉంటే.. తాజా నేషనల్ క్రష్ రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను సక్సెస్ కోసం ఒక విషయంలో చాలా రాజీ పడ్డానని అన్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత తన కుటుంబంతో తగినంత సమయం గడపడం లేకపోయాననీ, నా సక్సెస్ జర్నీలో ఆ విషయంలో చాలా రాజీ పడ్డానని బాధపడ్డారు. తన కెరీర్ విషయంలో తన కుటుంబం ఎంతో సపోర్టుగా నిలిచిందనీ, వారు కూడా తన కోసం త్యాగం చేశారని పేర్కొంది. తన జీవితంలోని విలువైన క్షణాలను కోల్పోయినప్పటికీ, తన సక్సెస్ ను చూసి ఫ్యామిలీ చాలా గర్వపడుతుందని ఎమోషనల్ అయ్యారు. సక్సెస్ కోసం ఎంతగానో శ్రమించానన్నారు.

అలాగే.. తన సోదరి కెరీర్ ను కూడా చూడలేదనీ, ఇది కష్టమైన నిర్ణయమేనైనా , ఆ విషయంలో కూడా తాను రాజీ పడ్డానని పేర్కొన్నారు. తనకు కుటుంబమే బలమనీ, తన లైఫ్ లో కీలక విషయాలను కుటుంబంతో గడపడానికి ఇష్టపడుతానని పేర్కొన్నారు. తన చెల్లి అంటే తనకు ఎంతో ఇషమనీ, ప్రతిరోజూ తామిద్దరం మెసేజ్‌లు చేసుకుంటామనీ, వరుస షూటింగ్స్ వల్ల తనతో గడిపే సమయాన్ని ఎంతగానో మిస్ అవుతున్నాననీ, తన చెల్లి తనకంటే చాలా స్మార్ట్ అని రష్మిక పేర్కొన్నారు. ప్రస్తుతం నేషనల్ క్రష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











