మహల్ కథ చెప్పిన క్రేజీ బ్యూటీ.. రష్మిక పోస్ట్ వైరల్
ఛలో బ్యూటీ రష్మిక మందాన్న తనలోని ప్రతిభను బయట పెట్టింది. అందమైన ఓ కథను ఎంతో ఆసక్తిరంగా చెప్పింది. చూస్తుంటే స్క్రిప్ట్ రాయడంలోనూ రష్మీక ఆరి తేరినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్, చెప్పిన కథ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కథ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.
'అగ్నివ్ మహల్ మెట్ల మీద నీలి రంగు చీర కట్టుకుని కూర్చుని ఉన్న మైరాపై శీతాకాలపు సూర్యుడి కాంతి ప్రసరిస్తోంది. ఆమె మహల్ రాతి మెట్లపై ఆసీనురాలైన వేళ, మహల్ పనివాళ్లు, తమ రోజువారీ పనులను చేసుకుంటూ చకచకా కదులుతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అగ్ని మహల్ గురించి ఎన్నో కథలను విన్న ఆమెకు ఈ పురాతన తలుపులు ఎల్లప్పుడూ తెరచుకోబడి ఆహ్వానాన్ని పలుకుతూనే ఉంటాయి.

ప్రతి ఉదయమూ సూర్య కాంతి, ఓ ద్రవ్యరాశిలా మహల్ లోని శిల్పాలపై పడి వాటికి అభ్యంగన స్నానం చేయిస్తుంటుంది. నిత్యమూ మైరా నీలి రంగు చీరలోనే పక్షుల కిలకిలారావాల మధ్య అక్కడ పనిచేసే వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తన కోరిక నెరవేరే క్షణాల కోసం వేచి చూస్తోంది. మహల్ మెట్లపై కూర్చుని నెలల తరబడి వేచి చూసిన మైరా కోరిక తీరే సమయం ఆసన్నమైంది.
కానీ ఆమె లావణ్యం కింద దాగిన నిశ్శబ్ద హృదయ వేదన, తలుపులు మరియు కిటికీల గుండా ప్రవహించే ప్రకాశవంతమైన సూర్యకాంతికి చాలా భిన్నంగా ఉంది. తన నిరీక్షణ ఫలించే రోజు వచ్చిందని ఆమె హృదయం ఆరాటపడుతోంద'ని అందంగా వివరించింది. నీలిరంగు చీరలో రష్మిక కుందనపు బొమ్మలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications