పుష్ప తరువాత మరో ఇంట్రెస్టింగ్ ఆఫర్ అందుకున్న రష్మిక మందన్న.. బిగ్ బడ్జెట్ కామెడీ మూవీ!
గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇస్తోంది. ఛలో సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న ఆ తర్వాత మంచి కథలు సెలెక్ట్ చేసుకుని వరుసగా బాక్సాఫీసు హిట్స్ అందుకుంది. వీలైనంతవరకు కమర్షియల్ సినిమాలను ఎక్కువగా చేస్తూ వస్తున్న రష్మిక మందన్న ప్రతీ సినిమాలో తన పాత్ర ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమా కూడా ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. అల్లు అర్జున్ తో చేసిన శ్రీవల్లి పాత్రకు ఓ వర్గం నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఫైనల్ గా సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది కాబట్టి రష్మిక మందన్న స్థాయి పెరిగిందనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీకి కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఈ సమయంలో ఆమె తొందరపడకుండా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటోంది. ఇక రీసెంట్ గా మరో బిగ్ బడ్జెట్ కామెడీ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలో మెల్లగా తన మార్కెట్ పెంచుకుంటున్న రష్మిక శివకార్తికేయన్ తో కూడా ఒకక్ సినిమా చేసే అవకాశం ఉందట. ఆ హీరో త్వరలోనే తెలుగు తమిళ్ లో ద్విభాషా చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది మరెవరో కాదు. జాతి రత్నాలు సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు అందుకున్న అనుదీప్ కె.వి. సురేష్ ప్రొడక్షన్స్ ఏషియన్ సినిమాస్ బ్యానర్లో దర్శకుడు అనుదీప్ ఒక ద్విభాషా చిత్రాన్ని చేయబోతున్నట్లు ఇటీవల అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనే విషయంలో రష్మిక పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో వరుస హిట్స్ తో ఇటు తెలుగు ఇండస్ట్రీలో అటు తమిళ ఇండస్ట్రీలో తన స్థాయిని పెంచుకుంటున్న రష్మిక మందన్న పాన్ ఇండియా సినిమా తో కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.
పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోవడంతో పెద్ద సినిమా దర్శక నిర్మాతలు రష్మిక మందన్న పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇక శివకార్తికేయన్ అనుదీప్ కాంబినేషన్లో తెరకెక్కనున్న బిగ్ బడ్జెట్ కామెడీ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కోటికి పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న రష్మిక మందన పుష్ప సినిమా అనంతరం ఆ సంఖ్యను మరింత పెంచనట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మరికొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏది సక్సెస్ అయినా కూడా శ్రీవల్లి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈజీగా అవకాశాలు అందుకుంటుంది అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











