మరో పాన్ ఇండియా సినిమాలో రష్మిక మందన్న.. అస్సలు తగ్గట్లేదుగా..
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ డామినేట్ చేస్తోంది. మొన్నటివరకు కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా వంటి వారు అగ్ర హీరోల సినిమాలు ఎక్కువగా దక్కించుకున్నారు. అయితే వారు సీనియర్లు అవ్వడంతో అగ్ర హీరోల న్యూ జనరేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి గ్లామరస్ బ్యూటీలు పెద్ద సినిమాలను టార్గెట్ చేస్తున్నారు. వరుసగా బాక్సాఫీస్ హిట్స్ దక్కడంతో వీరికి మరో రెండేళ్ల వరకు డోకా లేదని చెప్పవచ్చు. ఇక రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న రష్మిక నెక్స్ట్ రామ్ చరణ్ 15వ సినిమాలో కూడా ఛాన్స్ రావచ్చని తెలుస్తోంది.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగాన్ని పెంచాడు. ఆల్ మోస్ట్ తుది దశకు చేరుకుంది. రీసెంట్ గా టెక్నీకల్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఫైనల్ చేసుకున్నాడు. థమన్ మ్యూజిక్ అందించబోతున్న విషయం తెలిసిందే.
ఇక మెయిన్ హీరోయిన్ గా రష్మిక మందన్నను అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. సినిమా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని సమాచారం. ఇక మరొక పాత్ర కోసం ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి పేరు కూడా వినిపిస్తోంది కానీ అది ఎంతవరకు నిజమో చెప్పలేము. ఇక రష్మిక మందన్న పేరు అయితే చర్చల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











