అప్పుడు సమంత.. ఇప్పుడు రష్మీక.. ఉపాసన ప్లాన్ మామూలుగా లేదు!
రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కేవలం ఒక పవర్ఫుల్ బిజినెస్ తోనే కాకుండా ఇతర సామాజిక విషయాలపై ఎంతో అవగాహన ఉన్న మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఆమె అపోలో బ్యాక్ గ్రౌండ్ లో చేపడుతున్న ఎన్నో సేవా కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కూడా వైరల్ గా మారుతోంది.
ఇటీవల స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న ఆ వెబ్ పోర్టల్ కు గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించారు. ఇది వరకే సమంత గెస్ట్ ఎడిటర్ గా పలు ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీలు పరిచయం చేసి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు తనదైన శైలిలో రశ్మిక మందన్న కూడా తనకు తెలిసిన హెల్త్ టిప్స్, హెల్దీ రెసిపీలు పరిచయం చేయడానికి సిద్ధమైంది. మంగళవారం యువర్ లైఫ్ వెబ్ పోర్టర్ తమ సంస్థలోకి రశ్మికకు వెల్ కమ్ చెప్పారు.

టుగెదర్ ఫర్ వెల్ నెస్ అనే క్యాప్షన్ తో ఆరోగ్యాన్ని అందించడానికి సిద్ధం అంటూ అహ్వానించారు. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా ఫుడ్, వర్కవుట్స్ వంటి కంప్లీట్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు. ఉపాసన భవిష్యత్తులో ఈ పోర్టల్ కి మరింత గుర్తింపు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సమంత, రష్మీక వంటి వారి క్రేజ్ బాగానే ఉపయోగపడుతోంది. మరి ముందు ముందు ఇంకెంతమంది స్టార్ హీరోయిన్స్ ఉపాసనతో చేతులు కలుపుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











