Rashmika Mandanna: విజయ్ దేవరకొండను అది కావాలంటూ అడిగిన రష్మిక.. రౌడీబాయ్ రియాక్షన్ ఏంటంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన వీరిద్దరూ ఓవైపు కెరియర్ లో దూసుకు వెళ్తున్నారు. మంచి స్నేహితులుగా కొనసాగుతున్న వీరి మధ్య ప్రేమ ఉన్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. తమ మధ్య అలాంటి బంధం ఏమీ లేదని ఇటు విజయ్, అటు రష్మిక చెబుతూనే వస్తున్నా ఎవరూ నమ్మట్లేదు. అయితే తాజాగా రష్మిక మందన్నా ఎక్స్ వేదికగా విజయ్ దేవరకొండను అది కావాలంటూ అడగింది. దీంతో మళ్లీ వీరిద్దరి మధ్య లవ్ ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. అసలు ఆ విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎప్పుడూ విజయ్ దేవరకొండను సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఆయన కూడా ఆమెకు సపోర్టింగ్ గా నిలుస్తున్నారు. ఇద్దరిలో ఎవరి సినిమాలు విడుదల అవుతున్నా.. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ.. సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నారు. అయితే తామిద్దరి మధ్య ఉన్న మంచి స్నేహం కారణంగా వీళ్లు ఇలా చేస్తుండగా.. అందరూ వీరిద్దరి మధ్య ఏదో బంధం ఉందనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ ఉందని, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ చర్చలు నడుస్తున్నాయి.

Rashmika Mandanna Ask Party to Vijay Devarakonda Check Details

ఎన్ని పుకార్లు వచ్చినా పట్టించుకోకుండా.. తమ పని తాము చేసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు. ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదనుకుని.. తమ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఒకరినొకపు సపోర్ట్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా రష్మిక మందన్నా.. ఎక్స్ వేదికగా విజయ్ దేవరకొండ పోస్ట్ కు రిప్లై ఇచ్చింది. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ ను పోస్ట్ చేయగా.. రష్మిక పలు విషయాలు రాసుకొచ్చింది.

ఐ విష్ మై డార్లింగ్ పరుశురాం, విజయ్ దేవరకొండ అంటూ వాళ్లను ట్యాగ్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పింది. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం తాను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తప్పకుండా మీరు ఈ సినిమాతో హిట్ కొడతాని తెలిపింది. అలాగే పార్టీ కావాలంటూ అడిగింది. అలాగే హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ను ట్యాగ్ చేస్తూ ఆల్ ద బెస్ట్ మై లవ్ అటూ లవ్ ఎమోజీ జత చేసింది. దీనిపై అటు విజయ్ దేవరకొండతో పాటు ఇటు డైరెక్టర్ స్పందించారు.

Rashmika Mandanna Ask Party to Vijay Devarakonda Check Details

రష్మిక చేసిన పోస్ట్ కు రౌడీబాయ్ విజయ్ దేవరకొండ క్యూటెస్ట్ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలాగే విజయ్ రియాక్షన్ ఏంటని కూడా అంతా కామెంట్లు చూస్తున్నారు. ఈయన మాత్రమే కాకుండా ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ పరుశురాం కూడా ఈ పోస్టుకు రిప్లై ఇచ్చారు. యువర్ కైండ్ వర్డ్స్ మీ ఎ లాట్.. థాంక్యూ సో మచ్ అంటూ రాసుకొచ్చారు. మృణాల్ ఠాకూర్ ఇంకా స్పందించలేదు. మరి ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ ఏ రేంజ్ లో హిట్టు కానుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X