Rashmika Mandanna: వీల్ చైర్‌లో రష్మిక మందన్న.. సినిమా కోసం ప్రాణం పెట్టిన నేషనల్ క్రష్!
ఇప్పుడు టోటల్ ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ బిజీగా ఉన్నటువంటి టాప్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా నేషనల్ క్రష్ రష్మికా మందన్ననే అని చెప్పాలి. రష్మికా మందన్నా ఒక్క తెలుగు, తమిళ్ నుంచే కాకుండ హిందీ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే మారిపోయి తనకంటే సీనియర్ హీరోయిన్స్ కి షాకిచ్చింది.
ఇలా అటు హిందీ సినిమా ఇటు తెలుగు సినిమాలో కూడా వరుస హిట్స్ బిగ్ ఆఫర్స్ తో దూసుకెళ్తున్న రష్మిక లేటెస్ట్ గా పుష్ప 2 తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి అదరగొట్టింది. కాగా ఇలా హాట్ టాపిక్ గా మారే రష్మికపై కొన్ని షాకింగ్ విజువల్స్ ఇపుడు వైరల్ గా మారాయి. కాగా ఓ విమానాశ్రయంలో కనిపించిన రష్మిక మందన్నా కుంటుతూ కనిపించడం అందరికీ షాకిచ్చింది.

ఇంతే కాకుండా వీల్ చైర్ లో కూడా ఆమెని ఒక పేషేంట్ గా తోసుకెళ్తున్న విజువల్స్ ఇపుడు సోషల్ మీడియాలో తన వైరల్ గా మారి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. దీనితో అసలు తమ నేషనల్ క్రష్ కి ఏమయ్యింది అనేది చర్చకి దారి తీసింది. కాగా రష్మికకి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది అసలు కారణం తెలుస్తుంది. కాగా రష్మిక ఒక్క నటిగానే కాకుండా తనలోని హాట్ యాంగిల్ ని కూడా ఓ రేంజ్ లో చూపిస్తుంది అని తెలిసిందే.
కాగా హీరోయిన్స్ కి తమ అందాలని మెయింటన్ చెయ్యడం కూడా మామూలు విషయం కూడా కాదు. ఇలానే జిమ్ లో చాలా కసరత్తులు కూడా తప్పనిసరి. ఇప్పుడు ఇదే రష్మిక కొంప ముంచినట్టుగా తెలుస్తుంది. కాగా రష్మిక లేటెస్ట్ గా జిమ్ లో కసరత్తులు చేస్తుండగా ఆమె కాలుకి గాయం కావడంతో ఆ ఎక్కువ పెయిన్ అనుభవించినట్టుగా తెలుస్తుంది. అందుకే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకి కట్టు కూడా వేసుకునే పరిస్థితి లోకి వెళ్ళిపోయింది.
దీనితో ఆమె బయటకి వచ్చిన విజువల్స్ ఇపుడు షాకింగ్ గా మారాయి. దీనితో ఏ స్టార్ బ్యూటీని ఈ పరిస్థితులో చూసిన అభిమానులు బాధపడుతూ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా లేటెస్ట్ గానే రష్మిక నటించిన మరో భారీ హిందీ చిత్రం "చవ్వా" నుంచి తన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కి రాగా మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కానీ ఇంతలోనే మళ్ళీ ఆమెకి ఇలా జరిగి కనిపిస్తుంది అని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా హిందీలోనే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికందర్ సినిమాలో నటిస్తుండగా ఇది మాత్రమే కాకుండా తెలుగులో, తమిళ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది. అలాగే రానున్న రోజుల్లో పుష్ప పార్ట్ 3 లో కూడా రష్మిక కొనసాగనుంది.


Click it and Unblock the Notifications











