twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నోరు జారిన రష్మిక మందన్న... ఆమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తారా?

    |

    Recommended Video

    Did Rashmika Mandanna Make Anti-Kannada Comments? || Filmibeat Telugu

    హీరోయిన్ రష్మిక మందన్నపై కన్నడిగులు కారాలు మిర్యాలు నూరుతున్నారు. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ బిడ్డగా పుట్టి భాషను అవమానించే విధంగా ఆమె మాట్లాడిందనే అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.

    పలు కన్నడ సంఘాలు రష్మిక మందన్న తీరును తప్పుబడుతూ ఆందోళనకు సిద్దం అవుతున్నాయి. ఈ మేరకు వారు ఇప్పటికే కన్నడ సినీ వాణిజ్య మండలికి ఆమెపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శాండల్‌వుడ్ నుంచి ఆమెను తొలగించాలని, నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

    ఇంతకీ రష్మిక చేసిన తప్పేంటి?

    ఇంతకీ రష్మిక చేసిన తప్పేంటి?

    ‘డియర్ కామ్రేడ్' మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక చేసిన కామెంట్లే ఈ వివాదానికి కారణం. తొలుత ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే ప్లాన్ చేశారని, తర్వాత కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు ఆమె తెలిపారు. వెంటనే యాంకర్... మీకు కన్నడలో డబ్బింగ్ చెప్పడం ఈజీగా ఉంటుంది కదా? అని ప్రశ్నించగా ‘‘అది కూడా నాకు కష్టమే. నేను కన్నడ సరిగా మాట్లాడలేను' అంటూ సమాధానం ఇచ్చారు. ఈ కామెంట్స్ కన్నడిగుల ఆగ్రహానికి కారణమైంది.

    పరువు తీశావంటున్న కన్నడ ఫ్యాన్స్

    పరువు తీశావంటున్న కన్నడ ఫ్యాన్స్

    కన్నడ బిడ్డగా పుట్టి, కర్నాటకలో పెరిగి, కన్నడ సినిమా ద్వారా నటిగా గుర్తింపు తెచ్చుకున్న నువ్వు... మాతృ భాష మాట్లాడటం రాదని చెప్పడం విడ్డూరంగా ఉందని, కన్నడ భాషపై నీకు గౌరవం లేక పోవడం వల్లే ఇలా తయారయ్యావు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

    డియర్ కామ్రేడ్ చిత్రానికి ఇది తలనొప్పి కానుందా?

    డియర్ కామ్రేడ్ చిత్రానికి ఇది తలనొప్పి కానుందా?

    రష్మిక మందన్న వ్యాఖ్యల వల్ల ‘డియర్ కామ్రేడ్' చిత్రం కన్నడ రిలీజ్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ ఇష్యూ పెద్దగా అవ్వకుండా నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరం అయితే రష్మికతో క్షమాపణలు కూడా చెప్పించేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    డియర్ కామ్రేడ్

    డియర్ కామ్రేడ్

    విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని జులై 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

    English summary
    Rashmika Mandanna aunty-Kannada comments turns as controversy. In an interview with a Tamil website, Rashmika Mandanna was speaking about Dear Comrade and said. I cannot speak Kannada properly, I cannot speak any language correctly."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X