Rashmika Mandanna ఆ హీరోను ఇష్టపడి.. రూమర్లకు రష్మిక మందన్న చెక్
సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల వల్ల సినీ తారలు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కొన్నిసార్లు వస్తుంటాయి. ఎవరో ఏదో ఊహించుకొని ఏదో పోస్టు పెట్టడం వల్ల యాక్టర్లు కొన్నిసార్లు ఇబ్బందికి గురి అవుతారు. అలాంటి సంఘటనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఎదురైంది. అయితే తాను చెప్పని విషయాన్ని చెప్పినట్టు ఓ నెటిజన్ పోస్టు చేసిన ఓ కామెంట్‌కు రష్మిక ఘాటుగా సమాధానం చెప్పింది. ఆ పోస్టు ఏమిటి? రష్మిక స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందనే వివరాల్లోకి వెళితే..
పుష్ప మూవీ తర్వాత నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న ఇక హిందీ పరిశ్రమపై కన్నేసింది. హిందీలో హిట్స్, ఫ్లాప్స్ అనేది పట్టించుకోకుండా ఆమె సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకొంటున్నది. అయితే తనపై వచ్చే రూమర్లు, గాసిప్స్‌ను పెద్దగా పట్టించుకోదనే అందరికి తెలిసిందే. అయితే నెటిజన్ పోస్టుపై ఆమె స్పందించిన తీరు అభిమానులు ఆకట్టుకొంటున్నది.

అయితే ఇటీవల రష్మిక గురించి ఓ నెటిజన్ పోస్టు పెట్టడం అందర్నీ అటెన్సన్‌ను సంపాదించుకొన్నది. దాంతో గతంలో ఆమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా గురించి ఓ నెటిజన్ చేసిన పోస్టుపై ఆమె స్పందించింది. అయితే ఆ విషయాన్ని నేను చెప్పలేదు అంటూ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది.
నెటిజన్ ఓ పోస్టు పెట్టిన ప్రకారం.. నేను ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమా స్క్రిప్టు నాకు నచ్చలేదు. కానీ ఆ సినిమాను నేను ఒప్పుకొన్నాను. ఎందుకంటే.. డైరెక్టర్ కిషోర్ తిరుమల, హీరో శర్వానంద్‌ను ఇష్టపడి ఆ మూవీ చేశాను అని రష్మిక మందన్న చెప్పినట్టు ఉంది. ఆ పోస్టును చూసిన రష్మిక ఘాటుగా స్పందించింది.

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టు నాకు నచ్చలేదని ఎవరు చెప్పారు. వాస్తవంగా సినిమా స్క్రిప్టు చూసే నేను ఒప్పుకొంటాను. స్క్రిప్టు నచ్చకపోతే నటించను. ఇక స్క్రిప్టు నచ్చిన తర్వాత ఆ సినిమాలో నటించే హీరో, చేసే డైరెక్టర్‌తో పనిచేయడం గౌరవంగా భావిస్తాను. కానీ ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎలా.. ఎక్కడి నుంచి వస్తాయో అర్ధం కాదు అని రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా, రష్మిక మందన్న నటించిన యానిమల్ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో విశేషంగా ఆకట్టుకొన్నది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నది.


Click it and Unblock the Notifications