హాట్ ఫోజులతో షాకిచ్చిన రష్మిక మందన్నా: చీరకొంగును పక్కకు జరిపి మరీ.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

చూసే వాళ్ల కళ్లను మాయ చేయగల అందం.. సినీ ప్రియులను ఫిదా చేయగల అద్భుతమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. అందుకే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. కెరీర్ ఆరంభంలోనే అదగొట్టేసి వరుస ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంది. ఇక, ఇప్పుడు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది.

అదే సమయంలో రష్మిక మందన్నా సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాల విందు ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా పరిచయం.. టాలీవుడ్ ఎంట్రీ

అలా పరిచయం.. టాలీవుడ్ ఎంట్రీ

దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మిక మందన్నా.. శాండిల్‌వుడ్‌లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ 'కిర్రాక్ పార్టీ'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటనతో పాటు గ్లామర్‌తో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించిందామె. దీంతో అదే భాషలో రష్మికకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి చిత్రాల్లో చేసింది. ఈ క్రమంలోనే 'ఛలో' అనే సినిమాతో టాలీవుడ్‌లోకీ ప్రవేశించింది. మొదటి సినిమాతోనే హిట్‌ను అందుకుని టాలీవుడ్‌లోకి అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది.

హిట్ హీరోయిన్‌గా పేరు తెచ్చకుని

హిట్ హీరోయిన్‌గా పేరు తెచ్చకుని

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మిగిలిన భాషలతో పోలిస్తే రష్మిక మందన్నా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు భారీ విజయాలను అందుకుంది. మొదటి చిత్రం 'ఛలో'తో సక్సెస్‌ను దక్కించుకున్న ఈ బ్యూటీ.. తర్వాత 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక, 'దేవదాస్', 'డియర్ కామ్రేడ్' మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఆమె కెరీర్‌లో ఎక్కువ విజయాలు ఉండడంతో ఈ బ్యూటీ తెలుగులో హిట్ హీరోయిన్ అని పేరు దక్కించుకుని దూసుకెళ్తోంది.

నేషనల్ క్రష్‌గా.. అక్కడా ఫేమస్‌గా

నేషనల్ క్రష్‌గా.. అక్కడా ఫేమస్‌గా

రష్మిక మందన్నా చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ, ఆమె పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. దీనికి కారణం 2020 సంవత్సరానికి గానూ 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా ఎంపిక కావడమే. గూగుల్‌లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే ఈ కన్నడ భామ పేరుతో పాటు ఆమెకు సంబంధించిన‌ సమాచారం కనిపించేది. అంతలా ఈ బ్యూటీ హవాను చూపిస్తోంది. గతంలో ఆమె రక్షిత్ శెట్టి అనే కన్నడ హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఆమెను మరింత హైలైట్ చేశాయని చెప్పొచ్చు.

వాటిలో కూడా హవా చూపిస్తోందిగా

వాటిలో కూడా హవా చూపిస్తోందిగా

ప్రస్తుతం రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్ 'పుష్ప'తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఆమె.. శర్వానంద్ హీరోగా రాబోతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రాన్నీ చేస్తోంది. వీటితో పాటు 'మిష‌న్ మ‌జ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి సైతం అడుగెడుతోంది. అలాగే, అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. ఇవి మాత్రమే కాదు.. వరుసగా తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు ఒప్పుకుంటోంది. తద్వారా ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ తన హవాను చూపిస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

చాలా కాలంగా వరుస ఆఫర్లను అందుకుంటూ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు చేసి హైలైట్ అవుతోంది. ఎక్కువగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది.

అదే సమయంలోనే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. తద్వారా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోంది. ఇలా కూడా ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోందీ బ్యూటీ.

అప్పుడప్పుడూ అలాంటివి వదిలి

అప్పుడప్పుడూ అలాంటివి వదిలి


రష్మిక మందన్నా మిగిలిన హీరోయిన్లతో పోలీస్తే మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలను కూడా రష్మిక షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతూ ఉంటుంది. ఇది కూడా ఆమె నేషనల్ క్రష్‌గా ఎంపిక కావడానికి కారణం అయింది.

రష్మిక మందన్నా హాట్ ఫొటోలు వైరల్

రష్మిక మందన్నా హాట్ ఫొటోలు వైరల్

రష్మిక మందన్నా బిజీ షెడ్యూల్ కారణంగా ఇండియా మొత్తం చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అప్‌డేట్లు కూడా ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో నల్లచీర కట్టుకుని ఉన్న ఆమె.. పైటను పక్కకు జరిపి మరీ ఊహించని విధంగా క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, ఘాటు ఫోజులతో మరింతగా రెచ్చగొడుతోంది. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X