రష్మిక మందన్న‌కు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్... హీరో, డైరెక్టర్ ఎవరంటే?

Recommended Video

Rashmika Make Her Bollywood Debut With A Sanjay Leela Bhansali Film || Filmibeat Telugu

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వరుస విజయాలు అందుకోవడంతో టాప్ హీరోయిన్ల లిస్టులో చోటు దక్కించుకుంది రష్మిక మందన్న. ఇప్పటికే విజయ్ దేవరకొండతో కలిసి 'గీత గోవిందం' లాంటి భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం అతడితో కలిసి 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తోంది.

రష్మిక తన కెరీర్‌ను కేవలం సౌత్ ఇండస్ట్రీకే పరిమితం చేయకుండా బాలీవుడ్లోనూ విస్తరించాలనే ఆలోచనలో ఉంది. తాజాగా ఆమెకు బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ సెట్టయితే త్వరలోనే ఆమె హిందీ చిత్ర సీమలోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

సంజయ్ లీలా భన్సాలీ మూవీలో?

సంజయ్ లీలా భన్సాలీ మూవీలో?

సంజయ లీలా భన్సాలీ చిత్రం కోసం రష్మికతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రణదీప్ హుడా లీడ్ రోల్ చేయబోతున్నారు. అయితే రష్మిక రోల్ ఏమిటి అనే విషయాలు ఏమీ ఖరారు కాలేదు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ఇంకా సైన్ చేయని రష్మిక

ఇంకా సైన్ చేయని రష్మిక

ప్రస్తుతం రష్మికతో స్క్రిప్టు విషయమై చర్చలు జరుగుతున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ లాంటి టాప్ ఫిల్మ్ మేకర్ మూవీ కావడంతో ఆమె అదులుకునే అవకాశం లేదని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రాబోతోంది.

రష్మికకు వరుస అవకాశాలు

రష్మికకు వరుస అవకాశాలు

రష్మికకు తెలుగులో సైతం వరుస అవకాశాలు వస్తున్నాయి. అఖిల్ అక్కినేని మూవీ కోసం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు తెలుగు బిగ్ హీరోల సినిమాల్లో కూడా ఆమెను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్

ప్రస్తుతం రష్మిక ‘డియర్ కామ్రేడ్' అనే చిత్రంలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ మే 31న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లవ్, యాక్షన్ ఎంటర్టెనర్‌గా ప్రేక్షకులను అలరించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X