Rashmika Mandanna: ఆ డైరెక్టర్లు అయితే ఓకే... స్పెషల్ సాంగ్‌పై రష్మిక క్లారిటీ
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ విలువను సొంతం చేసుకున్నది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఫుల్ జోష్ మీదున్న హీరోయిన్ రష్మిక. తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవల ఈ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్స్, పారితోషికం, స్పెషల్ సాంగ్స్, నెగెటివిటీ వార్తలపై స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
తాజా ఇంటర్వ్యూలో ఓ టాక్ షోలో పాల్గొన్న రష్మికను హోస్ట్ డ్యాన్స్, స్పెషల్ సాంగ్స్ గురించి ప్రశ్నించగా, ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'నాకు సాధారణంగా డ్యాన్స్ చేయగలననే ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ నాతో స్పెషల్ సాంగ్ చేయించాలనుకుంటే... నన్ను ఆ సినిమాలో లీడ్ హీరోయిన్‌గా తీసుకోండి' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇదే సమయంలో రష్మిక మరో ఆసక్తికర అంశాన్ని కూడా వెల్లడించారు.'అయితే ఇండస్ట్రీలో 3-4 మంది డైరెక్టర్లు ఉన్నారు... వాళ్లు అడిగితే మాత్రం లీడ్ రోల్ కాకపోయినా స్పెషల్ సాంగ్ చేయడానికి నేను వెనుకాడను' అని చెప్పడం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

పారితోషికం రూమర్‌పై రష్మిక క్లారిటీ
ఇండస్ట్రీలో తానే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ అన్న ప్రచారంపై రష్మిక స్పందిస్తూ, అది పూర్తిగా అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. 'అందరూ నేను ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటానని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నేనేమీ హీరోను కాదు... అంత ఎక్కువ తీసుకోవడానికి. నిజం అయితే బాగుండేది అని నేనూ ఎదురుచూస్తున్నా'అంటూ నవ్వుతూ చెప్పింది. తన కెరీర్ జర్నీ గురించి మాట్లాడుతూ రష్మిక, 'నేను 2016 నుంచి ఇప్పటివరకూ ఒకేలా పని చేస్తున్నాను. భాషా పరమైన హద్దులు లేకుండా, భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నా' అని చెప్పింది.
అలాగే.. తనపై వచ్చే నెగెటివ్ వార్తలు, రూమర్స్‌పై కూడా రష్మిక స్పందించారు. 'వ్యూస్ కోసం, డబ్బుల కోసం కొందరు నెగెటివిటీ సృష్టించి మనపై ఏదేదో రాస్తారు. వాళ్లకు నిజంగానే నాపై కోపం ఉండొచ్చు. దానికి ఇంకాస్త యాడ్ చేసి రాస్తుంటారు' అని చెప్పింది. అయితే ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకుంటున్నానని, 'నిజాయతీగా చెప్పాలంటే అలాంటి వార్తలు కూడా ఎంతోమందిని పోషిస్తున్నాయి. పోనీలే... వాళ్లను కూడా బతకనీ అని వదిలేస్తా' అంటూ స్పందించడం అందరినీ ఆకట్టుకుంది.
ఒకప్పుడు రూమర్స్ విని చాలా బాధపడేదాన్నని, ఇప్పుడు మాత్రం వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానని రష్మిక చెప్పింది. 'ఇండస్ట్రీలో ఉన్నవారికి నెగెటివిటీ కామన్. అందరి పైనా వార్తలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక రోజు ప్రజలకు నిజం తెలుస్తుందని నమ్ముతున్నా. జీవితంలో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నా' అని ఆమె చెప్పిన మాటలు అభిమానులను బాగా ఇన్‌స్పైర్ చేస్తున్నాయి.
గ్లామర్ పాత్రలకే మాత్రమే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యమని రష్మిక ఇప్పటికే పలుమార్లు చెప్పింది. స్పెషల్ సాంగ్స్ విషయంలోనూ అదే దృక్పథాన్ని కొనసాగిస్తానని ఆమె తాజా వ్యాఖ్యలతో మరోసారి స్పష్టం చేసింది. అయితే.. ఆ దర్శకులు ఎవరో మాత్రం ఆమె వెల్లడించపోయిన సోషల్ మీడియాలో కొందరు యూజర్లు సంజయ్ లీలా భన్సాలీ పేరు ప్రస్తావిస్తుండగా, మరికొందరు సుకుమార్, రాజమౌళి, మణిరత్నం లాంటి ప్రముఖ దర్శకులే ఆ జాబితాలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











