For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పర్సనల్ లైఫ్‌ విషయంలో రష్మిక డేరింగ్ స్టెప్: సమంతలా ఇక్కడే సెటిల్ అవుతుందిగా.!

  By Manoj Kumar P
  |

  ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనను కనబరుస్తూ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకుంది రష్మిక మందన్నా. కన్నడ పరిశ్రమకు చెందిన అమ్మాయే అయినా.. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తూ ఇక్కడి వాళ్లను ఫిదా చేసేసింది. అదే సమయంలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తోంది. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న రష్మిక... పర్సనల్ లైఫ్ విషయంలోనూ తాజాగా ఓ డేరింగ్ స్టెప్ వేసిందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇందుకోసం స్టార్ హీరోయిన్ సమంతను ఫాలో అవుతోందట. ఇంతకీ ఏం జరిగింది.? వివరాల్లోకి వెళితే....

  చేసింది తక్కువే.. హిట్లు మాత్రం ఎక్కువ

  చేసింది తక్కువే.. హిట్లు మాత్రం ఎక్కువ

  రష్మిక మందన్నా తెలుగులో నటించిన చిత్రాలు తక్కువే. కానీ, అందులో హిట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆమె టాలీవుడ్‌లో ఆరు సినిమాల్లో నటించగా.. అందులో మొదటి చిత్రం ‘ఛలో'తో పాటు ‘గీత గోవిందం', ‘సరిలేరు నీకెవ్వరు', ‘భీష్మ' సూపర్ హిట్ అయ్యాయి. ‘దేవదాస్', ‘డియర్ కామ్రేడ్' మాత్రం బాగా నిరాశ పరిచాయి. అయినా ఆమెకు నటిగా గుర్తింపును తెచ్చాయి.

  ఫారెస్ట్ ఆఫీసర్‌ పాత్రలో రష్మిక మందన్నా

  ఫారెస్ట్ ఆఫీసర్‌ పాత్రలో రష్మిక మందన్నా

  రష్మిక మందన్నా ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని జోష్ మీద ఉంది. ఈ క్రమంలోనే ఆమె సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘పుష్ప'లో అల్లు అర్జున్ సరసన నటించనుంది. ఇందులో ఆమె ఫారెస్ట్ ఆఫీసర్‌గా కనిపించబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర సినిమాకు చాలా ముఖ్యమైనదనే టాక్ వినిపిస్తోంది.

  ఆ హీరోల ఛాయిస్ ఈ కన్నడ అమ్మాయే

  ఆ హీరోల ఛాయిస్ ఈ కన్నడ అమ్మాయే

  వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న రష్మిక.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆమె చాలా ప్రాజెక్టులను రిజెక్ట్ చేసిందని అంటున్నారు. మరోవైపు, ఈ భామ కోసం జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు వేచి చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  పర్సనల్ విషయంలో రష్మిక డేరింగ్ స్టెప్

  పర్సనల్ విషయంలో రష్మిక డేరింగ్ స్టెప్

  సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మిక మందన్నా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే భారీగా డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా వెలుగొందుతోంది. అదే సమయంలో మరిన్ని అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కన్నడ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయంలో ఓ డేరింగ్ స్టెప్ వేసినట్లు తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

  ఓ ఇంటిది అయిన రష్మిక.. సెంటర్‌లోనే

  ఓ ఇంటిది అయిన రష్మిక.. సెంటర్‌లోనే

  రష్మిక మందన్నా హైదరాబాద్‌లో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుందట. ఇందులో భాగంగానే ఆమె నగరంలోని గచ్చిబౌలి ఏరియాలో ఓ విలాసవంతమైన ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందని సమాచారం. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాటు నానక్‌రామ్‌గూడా స్టూడియో, అల్యూమినియం ఫ్యాక్టరీకి దగ్గరగా ఉండే ఏరియానే ఆమె ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

  Green India Challenge : Tollywood Celebrities Actively Participating Green India Challenge
  సమంతలా ఇక్కడే సెటిల్ అవుతుందిగా.!

  సమంతలా ఇక్కడే సెటిల్ అవుతుందిగా.!

  ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న అక్కినేని సమంత కూడా అప్పట్లో ఇలానే చేసింది. ఆమె మాత్రమే కాదు... అనుష్క శెట్టితో పాటు పలువురు నటీమణులు హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడిదే జాబితాలోకి కన్నడ పిల్ల రష్మిక మందన్నా కూడా వచ్చి చేరింది. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

  English summary
  Rashmika Mandanna, is an Indian film actress and model who works predominantly in Telugu and Kannada films. She is popularly dubbed by the media and Kannada film industry as the 'Karnataka Crush'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X