విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసిన రష్మిక మందన్న.. దాని విలువ ఎంతో తెలుసా?

కన్నడ భామ రష్మిక మందన్న కెరీర్ గ్రాఫ్ పీక్ స్టేజ్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నది. దక్షిణాది చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ రాణించే ప్రయత్నం చేస్తున్నది. తెలుగులో టాప్ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక ప్రస్తుతం ముంబైలో విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

గుణ 369 హీరోయిన్ లేటేస్ట్ పిక్స్.. అందంతో యువ హీరోయిన్ హంగామా

గత రెండేళ్లుగా సక్సెస్ గ్రాఫ్‌తో

గత రెండేళ్లుగా సక్సెస్ గ్రాఫ్‌తో

గత రెండేళ్లుగా రష్మిక మందన్న వరుస సక్సెస్‌లతో ముందుకెళ్తున్నారు. మహేష్ బాబు లాంటి సూపర్‌స్టార్స్‌తో నటించి మెప్పించారు. అలాగే కన్నడలోను మంచి విజయాలను అందుకొంటున్నారు. ఇలాంటి క్రమంలో వచ్చిన బాలీవుడ్ ఆఫర్లకు ఓకే చెప్పారు. దాంతో హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఆమె అడుగుపెట్టాల్సి వచ్చింది.

బిగ్‌బీ అమితాబ్‌తో డాడీ?

బిగ్‌బీ అమితాబ్‌తో డాడీ?

ఇక బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రాతో మిషన్ మజ్ను చిత్రంలో నటించేందుకు రష్మిక ఒకే చెప్పింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో డాడీ అనే చిత్రంలో నటించడానికి కూడా అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

బాలీవుడ్‌లో పాగా వేసేందుకు

బాలీవుడ్‌లో పాగా వేసేందుకు

తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని రష్మిక మందన్న తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. రానున్న రోజుల్లో రష్మిక ముంబై-హైదరాబాద్, బెంగళూరు-ముంబై మధ్య చక్కర్లు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ముంబైలో హోటల్స్‌లో ఉండే ఇష్టం లేక ప్రస్తుతం అక్కడే సొంతంగా ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది.

ముంబైలో ఖరీదైన ప్రాంతంలో

ముంబైలో ఖరీదైన ప్రాంతంలో

ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో రష్మిక భారీగా మొత్తంతో విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందనేది తాజా సమాచారం. సముద్ర తీరానికి దగ్గరలో సీ ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌లో ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. దాదాపు 10 కోట్లకుపైగానే అంటూ మాట వినిపిస్తున్నప్పటికీ.. ఫ్లాట్ విలువ ఎంతనేది సీక్రెట్‌గా ఉంచుతున్నట్టు తెలిసింది. అయితే అధికారికంగా వివరాలు అందిస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

ట్రెండీ కారును కొనుగోలు చేసిన కన్నడ భామ

ట్రెండీ కారును కొనుగోలు చేసిన కన్నడ భామ

ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలోనే రష్మిక అత్యంత ఖరీదైన, ట్రెండీగా ఉండే స్పోర్ట్స్ కారును ఖరీదు చేసిన విషయం తెలిసిందే. తన కారుతోపాటు ఓ ఫోటోను పెట్టి.. తనపై అభిమానులు కురిపిస్తున్న ప్రేమకు, అందిస్తున్న సపోర్టుకు ధన్యురాలును అంటూ కామెంట్ చేసింది.

రష్మిక మందన్న కెరీర్ ఇలా

రష్మిక మందన్న కెరీర్ ఇలా

ఇక రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. గతేడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత తాజాగా ఆమె నటించిన పొగరు చిత్రం కన్నడ, తమిళ భాషల్లో రిలీజైంది. ఇక అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హిందీలో మిషన్ మజ్ను, ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X