Elections 2024 మోడీ సర్కార్‌పై రష్మిక సంచలన వ్యాఖ్యలు.. వారికే ఓటేయండి అంటూ నేషనల్ క్రష్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె అభివృద్దికి ఓటు వేయాలని పిలుపు నిచ్చింది. ముంబైలోని అటల్ సేతు మార్గం నిర్మాణం, దేశంలోని యువ భారత్ కలల గురించి ఆమె మాట్లాడారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..
ప్రధాని నరేంద్రమోదీ చేసిన డెవలప్‌మెంట్ వల్ల ఎన్నో అసాధ్యంగా భావించే కొన్ని కార్యక్రమాలు సుసాధ్యం అయ్యాయి. నవీ ముంబై నుంచి ముంబై వరకు, ముంబై నుంచి గోవా వరకు 4 గంటల ప్రయాణం 20 నిమిషాల్లో పూర్తవుతుందని ఎవరైనా ఊహించారా? అలాంటి పనిని మోదీ ప్రభుత్వం చేసిందని నేషనల్ క్రష్ రష్మిక మందన్న అన్నారు.

అభివృద్దిలో ఇండియా దూసుకెళ్తున్నది. భారత్‌లో ఇది కాదు.. ఇది జరగదు అనే మాట వినిపించడం లేదు. ఏదైనా సాధ్యమే అనేది మోదీ ప్రభుత్వంలో రుజువైంది. అద్బుతమైన పాలన కొనసాగిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఇండియా ఎంతో పురోగతి సాధించింది. ఇన్ఫాస్ట్రక్చర్, రోడ్ ప్లానింగ్, ప్లానింగ్ అద్బుతంగా ఉంది అన్నారు.
ఎన్నో ఏళ్లుగా పూర్తి చేయలేని పనులు కేవలం 7 సంవత్సరాల్లో పూర్తి చేశారు. అటల్ సేతుతో కనెక్ట్ అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ 20 కిలోమీటర్ల సీ రోడ్డును చాలా త్వరగా పూర్తి చేసింది. యువ భారతం స్మార్ట్ కంట్రీగా మార్చింది. యంగ్ ఇండియన్ అంతా విజనరీగా ఉన్నారు. ప్రస్తుతం యువ భారతం సరైన ప్రభుత్వానికి ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది అని రష్మిక మందన్న తెలిపారు.
భారత్ దేశం యువ శక్తితో నిండి ఉన్నది. యువకులు చాలా బాధ్యతాయుతంగా ఉంది. వారికి ఎవరికి ఓటు వేయాలో తెలుసు. ఎవరికి ప్రభావితం కాకుండా బాధ్యతతో ఉన్నారు. యువ భారతం సరైన దిశలోనే సాగుతుంది. డెవలప్‌మెంట్ ఆగకూడదు. డెవలప్‌మెంట్ కోసం మాత్రమే ఓటు వేయండి అని రష్మిక మందన్న అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











