స్టార్ హీరోతో రొమాన్స్.. రష్మిక మందన్నపై మళ్లీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

దక్షిణాది చిత్ర పరిశ్రమను అందం, అభినయంతో రష్మిక మందన్న ఆకట్టుకొంటున్నది. దాంతో సినిమాను విజయ పథంలో నడిపించే కథానాయికగా పేరు తెచ్చుకొన్నది. ఆమె నటించిన ఛలో, గీతా గోవిందం, దేవదాస్ చిత్రాలు విజయవంతం కావడంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరోతో రష్మిక నటించే సినిమాపై రూమర్లు మీడియాలో చెలరేగాయి. థలపతి 64 చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వాటిపై రష్మిక స్పందిస్తూ..

తమిళ సూపర్ స్టార్ విజయ్ 64వ సినిమాలో తాను నటిస్తున్నట్టు రూమర్లు వస్తున్నాయి. అయితే అందులో వాస్తవం లేదు. చాలా మంది విజయ్‌తో కలిసి నటిస్తున్నావా అని అడుగుతున్నారు. దర్శకుడు అట్లీ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు నా వరకు వచ్చాయి. ఇప్పటి వరకు ఆ సినిమాపై క్లారిటీ లేదు. కానీ త్వరలో వారితో కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాను. మీ నుంచి వస్తున్న స్పందన చూసి నాకు మరింత ఆనందం కలుగుతున్నది. తమిళంలో కూడా ప్రవేశించి ప్రేక్షకుల ఆదరణను పొందుతాను అని రష్మిక తెలిపారు.

Rashmika Mandanna

ప్రస్తుతం దర్శకుడు అట్లీతో విజయ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఆ తర్వాత లోకేష్ మనగరమ్ అనే దర్శకుడు తెరకెక్కించే చిత్రంలో నటిస్తాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. దానిని థలపతి64 అని అంటున్నారు. అట్లీ దర్శకత్వం వహించే థలపతి 63లో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.

త్వరలోనే హీరో కార్తీ సరసన నటించే సినిమాతో రష్మిక తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రానికి రెమో దర్శకుడు బక్కియరాజ్ కన్నన్. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X